Breaking News

అక్షయ్‌ కుమార్‌ గొప్ప మనసు.. 650 కుటుంబాలకు సాయం

Published on Fri, 07/18/2025 - 09:13

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ గొప్ప మనసు చాటుకున్నారు. దేశవ్యాప్తంగా 650 మంది స్టంట్‌మ్యాన్‌ల కుటుంబాలకు అండగా నిలిచారు. దీంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు నెటిజన్లు కూడా ఆయన్ను అభినందిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కోలీవుడ్‌లో  స్టంట్‌మ్యాన్‌ రాజు (52) మృతి చెందిన విషయం తెలిసిందే. దర్శకుడు పా.రంజిత్‌ (pa ranjith) తెరకెక్కిస్తున్న వేట్టువం సినిమాలో భాగంగా కారుతో స్టంట్స్‌ చేస్తుండగా రాజు గుండెపోటు రావడం వల్ల మరణించారు. ఈ వార్త తెలుసుకున్న తర్వాత తాను చలించిపోయినట్లు నటుడు అక్షయ్‌ కుమార్‌ తెలిపారు.

సినిమాలో అత్యంత కీలకమైన యాక్షన్ స్టంట్స్ కోసం స్టంట్ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుందని అక్షయ్‌ అన్నారు. వారి కష్టం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని ఆయన తెలిపారు. 'ఒక్కోసారి ప్రమాదం జరిగితే వారి కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది. వారికి ఎలాంటి ఉద్యోగ భద్రత ఉండదు. వారికి ఇచ్చే రెమ్యునరేషన్‌ తక్కువగానే ఉంటుంది. అందువల్ల వారు వైద్య బీమాను భరించలేరు. ' అని ఆయన అన్నారు. దేశంలోని 650 మంది స్టంట్ వర్కర్ల ఆరోగ్య బీమాను చెల్లించాలని అక్షయ్ కుమార్ నిర్ణయించుకున్నారు. ఆరోగ్య కవరేజ్‌తో పాటు ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబానికి కొంత డబ్బు కూడా ఈ ఇన్సూరెన్స్‌ కంపెనీ చెల్లిస్తుందని చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)