Breaking News

దేశ పౌరసత్వాన్ని వదులుకున్న అక్షయ్‌కుమార్‌

Published on Fri, 02/24/2023 - 13:06

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆయనకు భారత్‌తో పాటు కెనడా పౌరసత్వం ఉన్న విషయం తెలిసిందే. దీనిపై కొన్నాళ్లుగా ఆయనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా అక్షయ్‌ కుమార్‌ స్పందించారు. తాను భారతీయుడినన్న అక్షయ్‌.. తన సర్వస్వం భారతదేశమేనని స్పష్టం చేశాడు. కెనడా పౌరసత్వం తీసుకోవడానికి గల కారణాలను వెల్లడించాడు.

‘ఆజ్ తక్’లో ప్రసారమవుతున్న ‘సీదీ బాత్' కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ''1990లలో నాకు వరుసగా 15 ప్లాఫులు వచ్చాయి. ఇక​ ఇండస్ట్రీలో కంటిన్యూ అవడం అసాధ్యం అని భావించాను. ఆ సమయంలోనే కెనడాలో ఉండే నా ఫ్రెండ్‌.. అక్కడికి వచ్చి ఏదైనా పని చేసుకోమని ఆఫర్‌ ఇచ్చాడు. దీంతో కెనడా పాస్‌పోర్టుతో పాటు అక్కడి పౌరసత్వం కోసం కూడా ధరఖాస్తు చేసుకున్నా.

అదే సమయంలో నేను నటించిన రెండు సినిమాలు అదృష్టం కొద్దీ సూపర్‌ హిట్‌ అయ్యాయి. దీంతొ నా ఫ్రెండ్‌.. వెళ్లి నీ పని చూసుకో అని చెప్పడంతో తిరిగి ఇండియాకు వచ్చాను. ఇది తెలుసుకోకుండా ప్రజలు నాపై విమర్శలు చేస్తుంటే చాలా బాధేస్తుంది. ఇప్పటికే కెనడా పాస్‌పోర్ట్‌ మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్నా'' అంటూ అక్షయ్‌ చెప్పుకొచ్చారు. 

Videos

నెల్లూరులో స్క్రూటినీ పేరుతో అధికారుల హైడ్రామా

తాడిపత్రిలో జేసీ ఒత్తిళ్లకు తలొగ్గిన ఎన్నికల అధికారులు

కోమటిరెడ్డి Vs అనిరుధ్ రెడ్డి.. డిండి నీళ్ల పంచాయితీ

Fire accident : చార్మినార్ ప‌రిధిలో భారీ అగ్నిప్రమాదం

కోనేరులోకి దూసుకెళ్లిన ఇన్నోవా.. తప్పిన పెను ప్రమాదం

తెలుగు ప్రజలకు YS జగన్ దసరా శుభాకాంక్షలు

పులివెందులలో ఖాకీ కుట్ర.. YSRCP శ్రేణులపై ఏకే 47తో కాల్పులు..

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)