Breaking News

ఏయ్‌ బాబూ, ఫోన్‌ తీయ్‌.. హీరో వార్నింగ్‌.. వీడియో వైరల్‌

Published on Mon, 07/21/2025 - 15:18

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar)కు కోపమొచ్చింది. అభిమాని చేసిన ఓ దుందుడుకు చర్యకు తిక్కరేగింది. కోపం అణుచుకోలేక వెంటనే తన అభిమానికి వార్నింగ్‌ కూడా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే అక్షయ్‌ కుమార్‌ లండన్‌ వీధుల్లో హాయిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. తనపాటికి తను ప్రశాంతంగా వెళ్తుంటే ఓ అభిమాని అతడిని వెంబడించాడు. 

అక్షయ్‌కు కోపమొచ్చింది
హీరో అనుమతి తీసుకోకుండా అక్షయ్‌ను వీడియో తీశాడు. ఇది గమనించిన అక్షయ్‌ కుమార్‌కు కోపమొచ్చింది. వెంటనే అభిమానివైపు నడుచుకుంటూ వచ్చి వీడియో ఎందుకు తీస్తున్నావని తిట్టాడు. వెంటనే కెమెరా ఆఫ్‌ చేయమంటూ బెదిరించాడు. అభిమాని ఫోన్‌ లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఇదంతా వీడియో తీసిన ఫ్యాన్‌.. దాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. 

ప్రశాంతంగా బతకనివ్వరా?
అయితే ఇందులో మొదట కోప్పడ్డ అక్షయ్‌.. చివరకు అభిమానికి నవ్వుతూ సెల్ఫీ ఇచ్చాడు. నా ఫోన్‌ తీసుకునేందుకు ప్రయత్నించే క్రమంలో అక్షయ్‌ నన్ను తాకాడు. అద్భుతమైన అనుభవం అని సదరు అభిమాని రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు.. వాళ్ల బతుకేదో వాళ్లను బతకనివ్వండి. ప్రశాంతంగా బయటకు వెళ్లే స్వేచ్ఛ కూడా వాళ్లకు లేదా? అని కామెంట్లు చేస్తున్నారు.

 

 

చదవండి: బతికుండగానే చంపేశారు.. అమ్మానాన్న ఒకటే కంగారు: శిల్ప

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)