Breaking News

ఓటీటీలో భారీ యాక్షన్‌ మూవీ.. ఆ రోజు నుంచి ఫ్రీగా చూడొచ్చు

Published on Mon, 03/17/2025 - 16:17

బాలీవుడ్ స్టార్  అక్షయ్‌కుమార్‌ నటించిన చిత్రం స్కై ఫోర్స్. ఈ యాక్షన్‌ మూవీని దర్శక ద్వయం సందీప్‌ కెవ్లానీ– అభిషేక్‌ అనిల్‌ కపూర్‌  తెరకెక్కించారు. జియో స్టూడియోస్, మాడ్‍డాక్ ఫిల్మ్స్, లియో ఫిల్మ్స్ యూకే ప్రొడక్షన్స్ పతాకాలపై జ్యోతి దేశ్‍పాండే, అమర్ కౌశిక్, భౌమిక్, దినేశ్ విజన్ దాదాపు రూ. 160 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. 1965లో జరిగిన ఇండియా–పాకిస్తాన్‌ వార్‌ నేపథ్యంలో భారతదేశపు మొదటి వైమానిక దాడి సంఘటనల ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. భారీ అంచనాల మధ్య  రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు వరకు కలెక్షన్లు రాబట్టింది.

ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.  అయితే కేవలం రెంటల్ పద్ధతిలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ మూవీని చూడాలంటే అదనంగా రూ.249 అద్దె చెల్లించాల్సిందే. ఈ మూవీ కేవలం హిందీ వర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. సబ్‌టైటిల్స్‌తో ఇతర భాషల వారు కూడా చూడొచ్చు.

అయితే ఈ సినిమాను ప్రేక్షకులకు ఉచితంగా అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. ఈనెల 21 నుంచి ఉచితంగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. కాగా... ఈ సినిమాలో వీర్‌ పహారియా, సారా అలీఖాన్, నిమ్రత్‌ కౌర్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో కమాండర్‌ కేవో అహుజా పాత్రలో అక్షయ్‌ కుమార్, టి. విజయ పాత్రలో వీర్‌ పహారియా నటించారు. 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)