Breaking News

అఖిల్ పెళ్లి.. 33 ఏళ్లనాటి సీన్‌ రిపీట్‌.. అచ్చం నాన్నలాగే..

Published on Mon, 06/09/2025 - 16:08

టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని ఓ ఇంటివాడయ్యారు. ఈ నెల 6న తన ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జైనాబ్ రవ్దీని అఖిల్ పెళ్లాడారు. ఈ పెళ్లి వేడుకలో పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. గతేడాది నవంబర్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న వీరిద్దరు పెళ్లిబంధంలో కొత్త జీవితం ప్రారంభించారు.

తాజాగా వీరి పెళ్లి వేడుక తర్వాత నాగార్జున పెళ్లి ఫోటోను వైరలవుతోంది. అఖిల్- జైనాబ్‌ పెళ్లిని నాగార్జున- అమల్ పెళ్లి (వీరి వివాహం 1992లో జరిగింది) ఫోటోతో పోలుస్తూ ఓ నెటిజన్‌ పోస్ట్ చేశాడు. అచ్చం నాన్న స్టైల్లోనే అఖిల్‌ పెళ్లి ఫోటో ఉందంటూ ఇద్దరి ఫోటోలను జత చేస్తూ ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. చూసేందుకు రెండు ఫోటోలు ఓకేలాగా కనిపించడంతో అక్కినేని ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ - జైనాబ్ కూడా నాగార్జున-అమల మాదిరిగానే కుర్తా, చీరను ధరించారు. అఖిల్ పెళ్లి వేళ నాగార్జున-అమల వివాహ వేడుక ఫోటోను చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

పెళ్లి తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో రామ్ చరణ్, మహేష్ బాబు, యశ్‍తో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా.. 2016లోనే వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి మనవరాలు శ్రియ భూపాల్‌తో అఖిల్‌కు నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత 2017లో ఊహించని విధంగా వివాహం రద్దైన సంగతి తెలిసిందే.
 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)