ఓటీటీలోకి అఖిల్ 'లెనిన్'.. అధికారిక ప్రకటన

Published on Sat, 08/01/2026 - 15:06

అక్కినేని హీరో అఖిల్ కెరీర్‌లో అందుకున్న తొలి సక్సెస్ 'లెనిన్'. గత నెలలో థియేటర్లలో రిలీజై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ ఓవరాల్‌గా రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితమే నిర్మాతలు ప్రకటించారు. ఇకపోతే ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఎందులోకి రానుంది?

అఖిల్, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన రూరల్ యాక్షన్ సినిమా 'లెనిన్'. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకుడు కాగా నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. జూలై 10న థియేటర్లలో రిలీజైంది. బాగానే అలరించింది. ఇప్పుడీ చిత్రాన్ని ఈనెల 7వ తేదీ నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.

'లెనిన్' విషయానికొస్తే.. చిత్తూరు జిల్లాలోని శ్రీరామాపురం అనే ఊరిలో ప్రతి ఏటా ద్రౌపది అమ్మ గుడిలో పద్దెనిమిదిరోజుల జాతర జరుగుతుంది. అనాథ అయిన లెనిన్ (అఖిల్) చిన్నతనంలో అక్కడికి వస్తాడు. ఓ సందర్భంలో జయంతి(ఈశ్వరీరావు) ఇతడి గురించి కనుక్కొని అనాథ అని తెలిసి తన ఇంటికి తీసుకెళ్తుంది. తన కన్న కొడుకు వసంత్ (ప్రమోద్)తో పాటే పెంచి పెద్దచేస్తుంది. వసంత్ మద్రాసులో చదువుకొని డాక్టర్ అయి ఊరికి తిరిగొస్తాడు. లెనిన్ మాత్రం చదువుకోకుండా ఊరిలో ఉండిపోతాడు.

ఓ ఏడాది జాతర టైంలో భారతి(భాగ్యశ్రీ బోర్సే)ని చూసి లెనిన్ ప్రేమలో పడతాడు. ఆమె కూడా లెనిన్‌ని ఇష్టపడుతుంది. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా భారతిని వసంత్‌కి ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయిస్తారు. మరి దీని తర్వాత ఏమైంది? ఈ కథలో యతిరాజులు (శివాజీ), దామోదర్ (బ్రహ్మాజీ), పార్థసారథి(సునీల్) ఎవరు? ఈ మహాభారతంలో అసలు విలన్స్ ఎవరు? లెనిన్ చివరకు ఏమయ్యాడు? అనేది మిగతా స్టోరీ.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)