Breaking News

నన్ను చూసి నాకే అసహ్యమేసింది: అఖిల్

Published on Sat, 07/25/2026 - 15:21

అక్కినేని అఖిల్.. 'లెనిన్' సినిమాతో కెరీర్‌లో తొలి సక్సెస్ అందుకున్నాడు. ఈ నెల 10న థియేటర్లలో రిలీజైన ఈ మూవీని చూసిన చాలామంది బాగుందని అన్నారు. అందుకు తగ్గట్లే పర్లేదనిపించే కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇండస్ట్రీకి వచ్చిన పదకొండేళ్ల తర్వాత అఖిల్ అందుకున్న తొలి హిట్ ఇది. అయితే ఇతడి గత చిత్రం 'ఏజెంట్' ఎంత దారుణమైన డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వయంగా అఖిల్.. 'ఏజెంట్' ఫ్లాప్ కావడంపై స్పందించాడు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

(ఇదీ చదవండి: అఖిల్ హిట్ కొడితే శ్రీలీల టార్గెట్ అయింది)

'ఏజెంట్ డిజాస్టర్ అయిన తర్వాత మళ్లీ ఆ సినిమా చూశాను. స్క్రీన్‌పై నన్ను నేను చూసుకుంటే చాలా అసహ్యమేసింది. దాదాపు ప్రతి సీన్‌లోనూ అతిగా ఓవరాక్టింగ్ చేశానని నాకే స్పష్టంగా అర్థమైంది. అలానే రిలీజ్‌కి ముందు ఫస్ట్ కాపీ చూసుకున్నప్పుడే ఏదో తేడా కొట్టిందని గ్రహించాను. అదే విషయాన్ని నా ఫ్రెండ్స్, క్లోజ్ సర్కిల్‌లోని కొందరికి చెప్పాను. అయితే నిర్మాత ఈ ప్రాజెక్ట్ కోసం కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుబడి పెట్టారు. హీరోగా ఆ మొత్తాన్ని వీలైనంత వరకు రికవరీ చేయాలి. కాబట్టి మూవీకి సపోర్ట్ చేయాలని భావించి ప్రమోట్ చేశాను' అని అఖిల్ చెప్పుకొచ్చాడు.

అయితే 'ఏజెంట్' సినిమాకు బౌండ్ స్క్రిప్ట్ లేకుండా దర్శకుడు సినిమా తీశారనే విమర్శలపై స్పందించిన అఖిల్.. ఇకపై తాను ఏ మూవీ కూడా బౌండ్ స్క్రిప్ట్ లేకుండా చేయనని కుండబద్దలు కొట్టేశాడు. 'ఏజెంట్' విషయానికొస్తే.. 2023లో థియేటర్లలో రిలీజైంది. సురేందర్ రెడ్డి తీసిన ఈ చిత్రం కోసం అఖిల్ చాలానే కష్టపడ్డారు. కండలు పెంచాడు. డైలాగ్ మాడ్యులేషన్ కూడా మార్చాడు. కానీ థియేటర్లలో తొలి షో తొలి ఆటకే డిజాస్టర్ టాక్ వచ్చింది. దీంతో డైలమాలో పడిపోయిన అఖిల్.. దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకుని 'లెనిన్'తో వచ్చాడు. సక్సెస్ అందుకున్నాడు. 

(ఇదీ చదవండి: షాకింగ్‌.. అఖిల్‌ అక్కినేని ఇండియన్‌ కాదా?)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)