Breaking News

నువ్వు అఖిల్ అయితే నేను నాగార్జున.. హీరోకి షాకిచ్చిన అపరిచితుడు

Published on Thu, 07/09/2026 - 23:39

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ సినిమా జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నేడు (శుక్రవారం) తెల్లవారుజామున 5 గంటల షోతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి యూఎస్ ప్రీమియర్స్ ముందుగానే ప్రారంభం కానున్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అఖిల్, గెటప్ శ్రీనుతో కలిసి చేసిన ఓ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీ తాగుతూ, మస్క్ బన్ తింటూ ఇద్దరూ సరదాగా ముచ్చటిస్తూ ఈ ఇంటర్వ్యూలో ఓ అపరిచితుడికి ప్రాంక్ కాల్ చేశారు.  

ఆ ప్రాంక్ కాల్‌లో.. అఖిల్ నేను అఖిల్ అక్కినేనిని మాట్లాడుతున్నానని చెప్పగా, దానికి అవతలి వ్యక్తి వెంటనే నేను నాగార్జునను మాట్లాడుతున్నానంటూ కౌంటర్ ఇచ్చాడు. అఖిల్ నిజంగానే తనతో మాట్లాడుతున్నాడని చెప్పినా కూడా ఆ వ్యక్తి నమ్మకుండా నాగ చైతన్య ఇప్పుడు ఎలా ఉన్నాడో చెప్పు అంటూ మరింత సెటైర్ చేశాడు. అంతేకాక, ఆ వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు వాయిస్‌ను మిమిక్రీ చేస్తూ “నా మనవడి వాయిస్ నేను గుర్తుపట్టలేను అనుకుంటున్నావా నాన్నా అఖిల్” అని మరో పంచ్ వేశాడు.  

అనంతరం అఖిల్ పక్కనే ఉన్న గెటప్ శ్రీను ఫోన్ అందుకుని నేను గెటప్ శ్రీను అన్నా అని చెప్పగా, ఆ వ్యక్తి వెంటనే నేను సుధీర్.. ఏంటో చెప్పండి అంటూ మరోసారి సెటైర్ చేశాడు. ఎంత చెప్పినా అతడు నమ్మకపోవడంతో అఖిల్, శ్రీను నవ్వుకుంటూ కాల్ కట్ చేశారు. కొద్దిసేపటికి ఆ వ్యక్తి తిరిగి కాల్ చేసి ఎవరు మీరు? ఎందుకు ఫోన్ చేశారు? అని అడగడం వీడియోలో కనిపించింది. ఈ సరదా ప్రాంక్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.  

ఈ మూవీ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూడేళ్ల గ్యాప్ తర్వాత అఖిల్ నుంచి వస్తోన్న సినిమా ఇదే కావడంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించింది. మురళీ కిషోర్‌ అబ్బూరు దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)