రోడ్డెక్కిన బస్సులు.. డిమాండ్లు సాధించిన RTC కార్మికులు
Breaking News
హీరో సంచలన నిర్ణయం.. రీషూట్ చేస్తున్న మేకర్స్ ?
Published on Sat, 04/25/2026 - 07:46
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘లెనిన్’కు విడుదల ముందే కష్టాలు మొదలయ్యాయని తెలుస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పటికే ఒక్కసారి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 26న రిలీజ్ చేస్తామని కొత్త తేదీని ప్రకటించారు. అయితే, ఇప్పడు తాజాగా వస్తున్న రూమర్స్ ప్రకారం చూస్తే జూన్‌లో లెనిన్ రావడం కష్టమేనని తెలుస్తోంది.

'లెనిన్' మూవీ గురించి ఇండస్ట్రీలో వస్తున్న రూమర్స్ ప్రకారం రీషూట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ఏడాదికి పైగా నిర్మాణ దశలోనే ఉంది. అయితే, అఖిల్ కోరికమేరకు కొన్ని సీన్స్ రీషూట్ చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ మూవీ జూన్ 26న విడుదల కావడం కష్టమేనని గుసగుసలు మొదలయ్యాయి.
లెనిన్ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి. సినిమాపై భారీగానే బజ్ క్రియేట్ అయింది. ప్రేక్షకుల అంచనాలను లెనిన్ అందుకుంటాడో లేదో కొద్దిరోజుల్లోనే తేలనుంది. అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పీ, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
Tags : 1