Breaking News

కొడుకుపై ట్రోలింగ్‌.. తొలిసారి రియాక్ట్‌ అయిన అమల అక్కినేని

Published on Sat, 04/29/2023 - 15:33

అక్కినేని అఖిల్‌ నటించిన ఏజెంట్‌ సినిమా నిన్న(శుక్రవారం)గ్రాండ్‌గా రిలీజైన సంగతి తెలిసిందే. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో స్పై యాక్షన్‌థ్రిల్లర్‌గా విడుదలైన ఈ సినిమా తొలిరోజే నెగిటివ్‌ టాక్‌ను తెచ్చుకుంది. అఖిల్‌ వంద శాతం ఈ సినిమా కోసం కష్టపడినా కథ, స్క్రీన్‌ ప్లే బాలేకపోవడంతో ఏజెంట్‌ సినిమాను, అఖిల్‌ను ట్రోల్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. చదవండి: అదిరిపోయిన విజయ్‌ ఆంటోని 'బిచ్చగాడు-2' ట్రైలర్‌

రిలీజ్‌కు ముందు భారీ హైప్‌ క్రియేట్‌ చేసినా సినిమా ఏమాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఏజెంట్‌ మూవీపై వస్తున్న ట్రోలింగ్‌పై అఖిల్‌ తల్లి అమల అక్కినేని తొలిసారిగా స్పందించారు.ట్రోలింగ్‌ అనేది ఇన్‌సెక్యూరిటీస్‌ వల్ల వస్తుంటుంది. కానీ అవి విజయానికి దోహదపడుతుంటాయి. నిన్న ఏజెంట్‌ సినిమా చూసి నిజంగానే చాలా ఎంజాయ్‌ చేశాను. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయి..కానీ మీరు ఓపెన్‌  మైండ్‌తో చూస్తే కశ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు.

నేను వెళ్లిన హాల్‌ మొత్తం నిండిపోయింది. అందులో ఎక్కువగా ఆడవాళ్లు, అమ్మలు, అమ్మమ్మలు ఉన్నారు. యాక్షన్‌ సీన్స్‌ వచ్చినప్పుడు వాళ్లంతా అరుపులు, కేకలతో బాగా ఎంజాయ్‌ చేశారు. ఒకటి మాత్రం చెప్పగలను.. అఖిల్‌ నెక్ట్స్‌ చేయబోయే సినిమా మరింత బెటర్‌గా ఉంటుంది అంటూ అమల తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. చదవండి: ప్రియురాలితో నటుడి సహజీవనం, రెండోసారి గర్భం దాల్చిన మోడల్‌ 


 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)