మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?
Breaking News
'అఖండ 2' అప్డేట్‌తో పాటు NBK111.. మొదలైన తాండవం
Published on Sun, 06/08/2025 - 11:09
నందమూరి బాలకృష్ణ 'అఖండ' తాండవం మొదలైంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'అఖండ 2' నుంచి తాజాగా అప్డేట్ ప్రకటించారు. జూన్ 9న సాయిత్రం 6.03గంటలకు టీజర్ విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఎం.తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో సంయుక్తా మేనన్, ఆది పినిశెట్టి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం తమన్ అందిస్తున్నారు. తాజాగా దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా బాలయ్యతో సినిమా ప్రకటించాడు NBK111పేరుతో ఒక పోస్టర్‌ను విడుదల చేశారు.

2021లో విడుదలైన అఖండ చిత్రానికి సీక్వెల్‌గా పార్ట్ 2ను తెరకెక్కించారు. ఈ ఏడాది దసరా సందర్బంగా సెప్టెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, అదేరోజున పవన్ కల్యాణ్ ఓజీ సినిమా కూడా రానుంది. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన అఖండ2 పోస్టర్‌లో రిలీజ్ డేట్ ప్రకటించలేదు. దసరా బరిలో ఈ రెండు పోటీలో ఉంటాయా..? అనే విషయం తెలియాలంటే అఖండ2 టీజర్‌తో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. బాలయ్య- బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Brace yourselves for the divine fury 🔥 #Akhanda2 - The Teaser Thaandavam from tomorrow ❤🔥#Akhanda2Teaser out on June 9th at 6.03 PM 🔱🔥#Akhanda2Thaandavam
'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @AadhiOfficial @MusicThaman @14ReelsPlus @iamsamyuktha_… pic.twitter.com/bD5Y7uRofb— 14 Reels Plus (@14ReelsPlus) June 8, 2025
Tags : 1