Breaking News

'అఖండ 2'.. ప్చ్‌ ఇప్పట్లో రిలీజ్‌ కష్టమే!

Published on Sat, 12/06/2025 - 07:18

‘అఖండ 2’ విడుదల వాయిదా పడటంతో అభిమానులు నిరాశ చెందారు. అయితే, ఎట్టకేలకు చిత్ర నిర్మాణ సంస్థ అప్‌డేట్‌ ఇచ్చింది. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని మరోసారి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. అఖండ2 విడుదల విషయంలో తాము చాలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కానీ, విడుదల సాధ్యపడలేదన్నారు. సినిమా కోసం ఆసక్తిగా ఎదరుచూస్తున్న ప్రేక్షకులకు మా క్షమాపణలు. ఇలాంటి సదర్భంలో మాకు అండగా నిలిచిన  బాలకృష్ణ, బోయపాటి శ్రీనుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. తప్పకుండా తిరిగొస్తాం.' అంటూ చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్‌ ప్లస్‌ క్లారిటీ ఇచ్చింది.

శుక్రవారం రాత్రి వరకు అఖండ2 విడుదల గురించి చర్చలు  ఉన్నాయి. ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని నిర్మాత దిల్‌రాజు, డి.సురేశ్‌బాబు కూడా ఎంట్రీ ఇచ్చారు. బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి  ఏరోస్‌ సంస్థతో చర్చలు జరిపారు. అయితే, ఈ విషయంపై శనివారం క్లారిటీ వచ్చే ఛాన్స్‌ ఉంది. వివాదం పూర్తిగా పరిష్కారమయిన తర్వాత విడుదల ఎప్పుడు చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటిస్తారు. బాక్సాఫీస్‌ వద్ద వచ్చే వారం చిన్న సినిమాలు విడుదల కానున్నాయి. దీంతో  అఖండ క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 19న విడుదల కావచ్చనే సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి. లేదంటే వచ్చే వారమే విడుదల చేసే ఛాన్స్‌ కూడా వుందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.

బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం అఖండ-2.. భారీ బడ్జెట్‌తో 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు.  ఈ సినిమా డిసెంబర్‌ 5న విడుదల కావల్సి ఉంది. కానీ, ఈ చిత్ర నిర్మాతలు తమకు బకాయిలు చెల్లించాలంటూ  ఏరోస్‌ సంస్థ మద్రాస్‌ కోర్టును ఆశ్రయించింది. దీంతో అఖండ-2 విడుదల ఆపాలంటూ న్యాయస్థానం స్టే ఇచ్చింది.
 

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)