Breaking News

గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ.. ఆ ఓటీటీ అన్ని కోట్లు పెట్టిందా?

Published on Thu, 05/23/2024 - 12:11

అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక్క మెతుకు చూస్తే చాలంటారు. అలాగే కొన్ని చిత్రాల జాతకం ఒక్క పోస్టర్‌తోనే తెలిసిపోతుంది. ఈ విషయాన్ని అజిత్‌ 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' చిత్రం నిరూపించింది. అజిత్‌ ప్రస్తుతం విడాయుయర్చి చిత్రంలో నటిస్తున్నారు. మగిళ్‌ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. పలు సమస్యలను అధిగమిస్తూ ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. 

గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ
ఇకపోతే అజిత్‌ తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. అదే గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ. మార్క్‌ ఆంటోని వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఇందులో అజిత్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. 

పోస్టర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌
ఆయనకు జంటగా శ్రీలీల, మీనా, సిమ్రాన్‌లు నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా చిత్ర షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం అవుతుందని సమాచారం. గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ అనే టైటిల్‌కు సూపర్‌ రెస్పాన్స్‌ రాగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ కూడా అదిరిపోయింది. అజిత్‌ మూడు ముఖాలతో కూడిన ఆ పోస్టర్‌ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచేసింది. 

ఓటీటీ రైట్స్‌
ఇక ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ రూ.95 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అజిత్‌ గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ చిత్రం ప్రారంభానికి ముందే సంచలనం సృష్టిస్తోందన్నమాట. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో రానుంది.

చదవండి: బిగ్‌ బాస్‌ ఓటీటీ సీజన్‌ 3 అప్డేట్‌ వచ్చేసింది.. మారనున్న హోస్ట్‌

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)