Breaking News

అజిత్ కుమార్ విదాముయార్చి.. ఆ సినిమా కంటే తక్కువగా తొలి రోజు కలెక్షన్స్!

Published on Fri, 02/07/2025 - 14:33

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌ విదాముయార్చి యాక్షన్-థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అజిత్ ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. తొలిరోజే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. దేశవ్యాప్తంగా రూ.22 కోట్ల నికర వసూళ్లు మాత్రమే సాధించింది.

గతేడాది వచ్చిన అజిత్ మూవీ తునివు(తెగింపు) వసూళ్లను మాత్రం విదాముయార్చి అధిగమించలేకపోయింది. తునివు చిత్రం మొదటి రోజే రూ. 24.4 కోట్ల నికర వసూళ్లను సాధించింది. విదాముయార్చి కేవలం రూ.22 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌కే పరిమితమైంది. అయితే వీకెండ్స్‌లోనైనా ఈ మూవీ వసూళ్లపరంగా రాణిస్తుందేమోనని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలో ఆక్యుపెన్సీ పరంగా చూస్తే ఉదయం 58.81 శాతం, మధ్యాహ్నం 60.27 శాతం, సాయంత్రం షోలలో 54.79 శాతంగా నమోదైంది. తిరుచ్చి, పాండిచ్చేరిలలో చెన్నై కంటే ఎక్కువగా 92 శాతం, 91.67 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా.. న్నైలో 88.33 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడిచాయి. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సుభాస్కరన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు