Breaking News

అజిత్‌ కుమార్‌ గుడ్ బ్యాడ్ అగ్లీ.. మూడు రోజుల్లోనే సెంచరీ!

Published on Sun, 04/13/2025 - 15:13

విదాముయార్చి తర్వాత స్టార్ హీరో అజిత్ కుమార్‌ నటించిన తాజా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ వఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపపరంగా దూసుకెళ్తోంది.

ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్కును దాటేసింది. తొలి రోజే రూ.30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల  మార్కును చేరుకుంది. దీంతో అజిత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులు బద్దలు కొట్టనుంది. నెట్ కలెక్షన్స్ పరంగా చూస్తే ఇండియా వ్యాప్తంగా మూడు రోజుల్లోనే రూ.62.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.

అధిక్ రవిచంద్రన్‌ డైరెక్షన్‌లో వచ్చిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' భారీ అంచనాల థియేటర్లలో విడుదలైంది. దర్శకుడు మగిజ్ తిరుమేని 'విదాముయార్చి' తర్వాత ఈ ఏడాదిలో అజిత్ కుమార్‌కి ఇది రెండో మూవీ కావడం విశేషం. ఈ చిత్రం అజిత్ కుమార్‌ గ్యాంగ్‌స్టర్‌గా అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో అర్జున్ దాస్, త్రిష కృష్ణన్, ప్రభు, ప్రియా ప్రకాష్ వారియర్, రఘు రామ్, కార్తికేయ  కీలక పాత్రలు పోషించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)