Breaking News

ఇలియానాపై నాకెలాంటి ఈర్ష్య లేదు.. దానికోసమే ప్రయత్నించా!: వాణి కపూర్‌

Published on Wed, 04/09/2025 - 11:50

రైడ్‌.. 2018లో అజయ్‌ దేవగన్‌ (Ajay Devgn) హీరోగా రాజ్‌కుమార్‌ గుప్తా  దర్శకత్వంలో వచ్చిన  ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. ఏడేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ వస్తోంది. అదే రైడ్‌ 2 (Raid 2 Movie). ఇందులో మరోసారి అజయ్‌ దేవ్‌గణ్‌ హీరోగా, రాజ్‌కుమార్‌ గుప్తా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే హీరోయిన్‌ మాత్రం మారింది. తొలి భాగంలో ఇలియానా కథానాయికగా ఉండగా రెండో భాగంలో మాత్రం ఆమె స్థానంలో వాణీ కపూర్‌ను ఎంపిక చేశారు.

సేమ్‌ ఇక్కడ కూడా..
ఇలియానా (Ileana D'Cruz)ను ఎందుకు తప్పించారన్న ప్రశ్నలపై అజయ్‌, వాణికపూర్‌ స్పందించారు. రైడ్‌ 2 ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో అజయ్‌ దేవ్‌గణ్‌ మాట్లాడుతూ.. మీరు చాలా హాలీవుడ్‌ సినిమాలు చూసే ఉంటారు. జేమ్స్‌బాండ్‌ ఫ్రాంచైజీలో వచ్చిన సినిమాల్లో జేమ్స్‌బాండ్‌ ఒక్కరే ఉండరు. ఆ పాత్ర కొనసాగుతుంది కానీ నటులు కాదు. ఎప్పటికప్పుడు జేమ్స్‌బాండ్‌ రోల్‌లోకి కొత్తవాళ్లు వస్తుంటారు. అదే ఇక్కడ కూడా జరిగింది అని క్లారిటీ ఇచ్చాడు.

ఇలియానాపై అసూయ లేదు
వాణీ కపూర్‌ (Vaani Kapoor) మాట్లాడుతూ.. రైడ్‌ 1 సినిమాలో హీరోయిన్‌గా చేసినవారిపై నాకెలాంటి ఈర్ష్య లేదు. మా ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. రచయిత, దర్శకుడు నన్ను సంప్రదించారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నేను ప్రయత్నించాను. అంతే.. ఈ సినిమాలో నాలో మరో కోణాన్ని చూస్తారు. ఈ పాత్ర నాకు కొత్తగా ఉంది అని చెప్పుకొచ్చింది.

సినిమా రిలీజ్‌ ఎప్పుడంటే?
రైడ్‌ 2 విషయానికి వస్తే.. ఇందులో అజయ్‌.. ఐఆర్‌ఎస్‌ అధికారి అమయ్‌ పట్నాయక్‌గా కనిపించనున్నాడు. రితేశ్‌ దేశ్‌ముఖ్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్‌ పాఠక్‌, కుమార్‌ మంగత్‌ పాఠక్, భూషణ్‌ కుమార్, గౌరవ్‌ నంద, క్రిషణ్‌ కుమార్, ప్రగ్యా సింగ్‌ నిర్మించారు. రైడ్‌ 2 మే 1న విడుదల కానుంది. ఈ మూవీలో తమన్నా స్పెషల్‌ సాంగ్‌ చేయనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

 

చదవండి: నేను నివసించని ఇంటికి రూ.1 లక్ష కరెంట్‌ బిల్లు.. కంగనా షాక్‌ 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)