Breaking News

అజయ్‌ దేవగణ్ రైడ్-2.. ఛావా తర్వాత రెండో చిత్రమిదే!

Published on Tue, 05/20/2025 - 15:21

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ నటించిన చిత్రం 'రైడ్ 2'. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 1న థియేటర్లలో విడుదలైంది. గతంలో వచ్చిన రైడ్ మూవీ సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మొదటి రోజే పాజిటివ్ టాక్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లు వసూలు చేసింది. దాదాపు 18 రోజుల తర్వాత ఈ బెంచ్‌మార్క్‌ను అధిగమించింది.  దీంతో ఈ సంవత్సరం విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన ఛావా తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ బాలీవుడ్ చిత్రంగా నిలిచింది.

ఈ సినిమాకు రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వం వహించారు. ఈ మూవీ విడుదలైన 19 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 201.50 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించింది. కేవలం ఇండియాలో మాత్రమే రూ. 177.50 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య  ఉద్రిక్తతలు, ఇటీవల విడుదలైన హాలీవుడ్ మూవీ 'మిషన్: ఇంపాజిబుల్-ది ఫైనల్ రికనింగ్' కారణంగా  రైడ్‌-2 కలెక్షన్స్‌ కొద్దిగా తగ్గినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా రూ. 151.50 కోట్ల నెట్‌ వసూళ్లు కలెక్ట్ చేసింది.

కాగా.. 'రైడ్ 2' ఊహించిన దానికంటే థియేటర్లలో బాగానే నడుస్తోంది. అజయ్ దేవగణ్‌ కెరీర్‌లో రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా రైడ్‌-2 నిలిచింది. గతేడాది నవంబర్‌లో దీపావళికి విడుదలైన 'సింగం ఎగైన్' తర్వాత ఈ మూవీ రికార్డ్‌ సాధించింది. అయితే 2018లో విడుదలైన 'రైడ్' ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 154 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీలో వాణి కపూర్ హీరోయిన్‌గా నటించగా..  రితేష్ దేశ్‌ముఖ్, సౌరభ్ శుక్లా ముఖ్య పాత్రల్లో నటించారు.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)