Breaking News

అట్టర్‌ఫ్లాప్‌గా లాల్‌సలామ్‌.. నాన్నవల్లేనన్న ఐశ్వర్య రజనీకాంత్‌!

Published on Fri, 03/08/2024 - 18:44

లాల్‌ సలామ్‌.. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా చతికిలపడింది. ఈ మూవీలో రజనీకాంత్‌ది అతిథి పాత్ర మాత్రమే! విష్ణు విశాల్‌, విక్రాంత్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే కూతురే డైరెక్టర్‌ కావడంతో రజనీ గెస్ట్‌గా నటించేందుకు ఓకే చెప్పాడు. కానీ ఆయన అలా వచ్చి ఇలా వెళ్లిపోతే ఏం బాగుంటుందని తన పాత్రను బలవంతంగా పొడిగించారట. దానివల్లే ఈ సినిమా ఫ్లాప్‌ అయిందంటోంది ఐశ్వర్య రజనీకాంత్‌.

రజనీ ఇమేజ్‌కు తగ్గట్లుగా..
తాజాగా ఆమె మాట్లాడుతూ.. 'లాల్‌ సలామ్‌ చిత్రంలో మొయిదీన్‌ భాయ్‌ పాత్ర నిడివి మొదట్లో 10 నిమిషాలే అనుకున్నాం. ‍కానీ ఎప్పుడైతే ఆయన(రజనీకాంత్‌) ఆ రోల్‌ చేస్తానన్నాడో తన రేంజ్‌కు పది నిమిషాలు పెడితే ఏం బాగుంటుందనుకున్నాం.. నిడివి పెంచాలని డిసైడయ్యాం. దీంతో స్క్రిప్ట్‌ మారిపోయింది. మొయిదీన్‌ భాయ్‌ చుట్టూ సినిమా తిరిగేలా ప్లాన్‌ చేశాం. నిజానికి అతడు ఇంటర్వెల్‌ వస్తాడు. కొన్ని కారణాల వల్ల తనను సినిమా ప్రారంభంలోనే పరిచయం చేశాం. లేదంటే ప్రేక్షకులు ఇంటర్వెల్‌ వరకు ఓపిక పట్టలేరేమోనని భయపడ్డాం.. అందుకే సినిమా అంతటా ఆయన ఉండేలా రకరకాలుగా ఎడిట్‌ చేయాల్సి వచ్చింది.

ఆయన్ను చూశాక సినిమా పట్టించుకోలేదు
సినిమాలో కంటెంట్‌ బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే రజనీకాంత్‌ను చూపించామో అంతా నీరుగారిపోయింది. ఆయన్ను చూశాక మిగతా కథ గురించి, పాత్రల గురించి ఎవరూ పట్టించుకోలేదు. అంటే రజనీకాంత్‌ సినిమా అంటే పూర్తిగా ఆయన గురించి మాత్రమే ఉండాలి. అది కాకుండా వేరే వాటిపై ఫోకస్‌ చేస్తే జనాలు ఒప్పుకోరని నాకు ఈ సినిమాతో తెలిసొచ్చింది. ఆయన ఉంటే మిగతావాటిపై ఎవరూ ఫోకస్‌ చేయలేరు. అంతగా డామినేట్‌ చేస్తాడు' అని చెప్పుకొచ్చింది.

చదవండి: రెండో పెళ్లి చేసుకున్న నటి మాజీ భర్త.. ఆశీర్వదించండంటూ పోస్ట్‌..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)