Breaking News

'లాల్‌ సలామ్‌' ఓటీటీ ఆలస్యానికి కారణం చెప్పిన ఐశ్వర్య

Published on Mon, 09/16/2024 - 12:32

సౌత్‌ ఇండియాలో  భారీ అంచనాల మధ్య రజనీకాంత్‌ 'లాల్‌ సలామ్‌' విడుదలైంది. అయితే, ప్రేక్షకుల  ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా చతికిలపడింది. అయినప్పటికీ రజనీ అభిమానులు ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా లాల్‌సలామ్‌ ఓటీటీ రిలీజ్‌ గురించి చిత్ర డైరెక్టర్‌ ఐశ్వర్య రజనీకాంత్‌ ఆప్‌డేట్‌ ఇచ్చారు. అతి త్వరలో ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకొస్తామని ఆమె ఇలా ప్రకటించారు.

'లాల్‌ సలాం' చిత్రాన్ని తెరకెక్కించడంలో మేము చాలా కష్టపడ్డాం. కానీ, మేము అనుకున్నంతగా విజయం పొందలేకపోయాం. మొదటి మేము అనుకున్నట్లుగా థియేటర్‌లో విడుదల చేయలేదు. కొన్ని సీన్లు లేకుండానే మీ ముందుకు తీసుకొచ్చాం.  ఆ సీన్లు అన్నీ సినిమాకు చాలా ముఖ్యమైనవి. హార్డ్‌ డిస్క్‌ కనిపించకపోవడం వల్లే ఈ ఇబ్బందులు పడ్డాం. అయితే, అందులో మిస్‌ అయిన సీన్లు ఇప్పుడు రికవీరే చేశాం. వాటిని సినిమాకు యాడ్‌ చేసి సరికొత్తగా ఓటీటీ వర్షన్‌లో విడుదల చేస్తాం. ఇప్పటికే ఆ సీన్లకు సంబంధించిన మ్యూజిక్‌ వర్క్‌ను రెహమాన్‌ ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి ఆయన ఎలాంటి రెమ్యునరేషన్‌ తీసుకోలేదు.' అని ఐశ్వర్య చెప్పుకొచ్చారు.

లాల్‌ సలామ్‌ చిత్రంలో మొయిదీన్‌ భాయ్‌ పాత్ర నిడివి మొదట్లో 10 నిమిషాలే అనుకున్నాం. ‍కానీ ఎప్పుడైతే ఆయన(రజనీకాంత్‌) ఆ రోల్‌ చేస్తానన్నాడో తన రేంజ్‌కు పది నిమిషాలు పెడితే ఏం బాగుంటుందని విడుదలకు రెండురోజుల ముందు అనుకున్నాం. ఈ క్రమంలో ఆయన పాత్రకు సంబంధించి నిడివి పెంచాలని డిసైడయ్యాం. దీంతో స్క్రిప్ట్‌ మారిపోయింది. ఆపై హార్డ్‌ డిస్క్‌ కనిపించకుండా పోయింది. దీంతో తప్పని పరిస్థితిలో సినిమాను విడుదల చేయాల్సి వచ్చింది. 

 ఇదీ చదవండి: ఒక్కటైన సిద్ధార్థ్-అదితీ.. ఫొటోలు వైరల్

కథలో బలం ఉన్నప్పటికీ చివరి క్షణంలో తీసుకున్న నిర్ణయాల వల్లే సినిమాకు మైనస్‌గా మిగిలింది. ఇప్పుడు ఓటీటీ వర్షన్లో అలాంటి ఇబ్బంది ఉండదు. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది. అని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 20న సన్‌ నెక్ట్స్‌, నెట్‌ఫ్లిక్స్‌లో లాల్‌ సలామ్‌ స్ట్రీమింగ్‌కు రానుందని టాక్‌. థియేటర్‌లో చూడని వారికి తప్పకుండా నచ్చుతుందని ఫ్యాన్స్‌ అభిప్రాయ పడుతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)