Breaking News

చాలా కష్టాలు పడ్డా.. జీవితం చాలా పాఠాలు నేర్పింది: హీరోయిన్‌

Published on Tue, 08/16/2022 - 08:57

చిన్నతనంలో ఐశ్వర్య రాజేష్‌ చాలా కష్టాలు పడిందట. పేరులో ఉన్న ఐశ్వర్యం తన జీవితంలో లేదని వ్యాఖ్యానించింది. ఇటీవల ఒక భేటీలో ఈ బ్యూటీ మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయానని, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సోదరులు దుర్మరణం పాలయ్యారని తెలిపింది. జీవితం తనకు రకరకాల పాఠాలను నేర్పిందని, సినిమా రంగ ప్రవేశానికి ముందు ఆ తర్వాత కూడా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయని వాపోయింది.

స్టార్‌ కథానాయకి పేరు రాకపోయినా పర్వాలేదనీ, మంచి నటి అన్న పేరు తెచ్చుకుంటే చాలన్నారు. తాను నటించిన చిత్రాలు ప్రేక్షకుల మనసులో పదికాలాలపాటు నిలిచిపోతే చేయాలన్నదే తన ఆశని వివరించింది. తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబం నుంచి వచ్చిన ఐశ్వర్య తమిళ చిత్ర పరిశ్రమలో కథానాయికగా పేరు తెచ్చుకుంది. మాతృభాషలోనూ రాణిస్తోంది.

చిన్న చిన్న పాత్రలతోనే ఈమె కెరీర్‌ ప్రారంభమైంది. కాక్కా ముట్టై చిత్రం ఐశ్వర్య రాజేష్‌ కేరీర్‌ను మలుపు తిప్పింది. అందులో ఇద్దరు పిల్లల తల్లిగా ఆమె అద్భుత నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత వరుసగా కథానాయికగా అవకాశాలు తలుపు తట్టాయి. కనా వంటి హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రంల్లో నటించి తన నటనా సత్తాను చాటారు. ప్రస్తుతం తమిళంలో అరడజను చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)