Breaking News

ఒక తల్లిగా ఆందోళనగా ఉంది.. ఐశ్వర్య రాయ్ వ్యాఖ్యలపై ప్రశంసలు

Published on Tue, 08/19/2025 - 12:10

బాలీవుడ్‌ నటి ఐశ్వర్య రాయ్ ప్రముఖ కాస్మెటిక్ బ్రాండ్ కోసం చేసిన వీడియో ఒకటి వైరల్‌ అవుతుంది. అందులో సోషల్‌ మీడియా గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు యూత్‌ను ఆలోచింపచేసేలా ఉన్నాయి. ఈమేరకు ఆమెపై నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా చాలామంది గుర్తింపు కోసం సోషల్‌మీడియా మాయ ప్రపంచంలో చిక్కుకుంటున్నారని.. ఈ అంశం తనకు ఎక్కువ ఆందోళన కలిగిస్తుందంటూ ఐశ్వర్య వ్యాఖ్యలు చేశారు.

సోషల్‌మీడియాలో వచ్చే లైక్స్‌, కామెంట్స్ మన జీవితాలను నిర్ణయించలేవని ఐశ్వర్య రాయ్‌ చెప్పుకొచ్చారు. 'నేటి సమాజంలో మన విలువను ఎవరూ నిర్ణయించలేరు. చాలామంది సోషల్‌మీడియా ట్రాప్‌లో పడుతున్నారు. వారు చేసే పోస్ట్‌లకు వచ్చే లైక్స్‌, కామెంట్లు, షేర్‌లు చూసుకొని సంబరపడుతుంటారు. వాటిలో ఎవీ కూడా మనలోని ఆత్మవిశ్వాసాన్ని ఈ ప్రపంచానికి చూపలేవు. కానీ, నువ్వు నీలా ఉంటే అసలైన ప్రపంచం కనిపిస్తుంది. మీకు కావాల్సిన ఆత్మగౌరవం కోసం ఇంటర్నెట్‌లో వెతకొద్దు.  ఒక్కసారి దానిని దాటి ముందుకు రండి మీకు దక్కాల్సిన గౌరవం తప్పకుండా దొరుకుతుంది. సోషల్‌మీడియా అంశంపై ఒక మహిళగా, తల్లిగా  నాకు ఆందోళన కలుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ దీనికి బానిసలు అవుతున్నారు.. దయచేసి అందులో నుంచి బయటపడండి.' అంటూ ఐశ్వర్య చెప్పుకొచ్చారు. 

దీంతో ఐశ్వర్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నేటి యూత్‌కు కావాల్సిన మెసేజ్‌ను అందించారని కామెంట్లు చేస్తున్నారు. ప్రపంచంలో సగం మంది ఆమె చెప్పేది అర్థం చేసుకుంటే బాగుండు అంటూ అభిప్రాయ పడుతున్నారు.  ఈ యుగంలో చాలా అవసరమైన సందేశాన్ని అందించారంటూ చాలామంది ఆమెను ప్రశంసించారు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)