Breaking News

అందాల ఐశ్వర్యను అలాంటి పాత్రలో ఫ్యాన్స్‌ ఒప్పుకుంటారా?

Published on Sun, 08/28/2022 - 09:03

తమిళసినిమా: అందం, అభినయానికి మారు పేరు నటి ఐశ్వర్యారాయ్‌. కథానాయికగా హిందీ, తెలుగు, తమిళం వంటి భాషా చిత్రాల్లో నటించి మేటి నటిగా పేరు తెచ్చుకున్నారు. దర్శకుడు మణిరత్నం కోలీవుడ్‌కు పరిచయం చేసిన నటి ఐశ్వర్యారాయ్‌ అన్న విషయం తెలిసిందే. ఆమె మణిరత్నంను గురువుగా భావిస్తారు. కాగా కథానాయకిగా పరిచయం చేసిన ఆయనే ఐశ్వర్యారాయ్‌ను ఇప్పుడు ప్రతినాయకిగా చూపిస్తూ ఆమెలోని నటిని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తాజా సమాచారం. మణిరత్నం ఏ చిత్రాన్ని చేసినా దాంట్లో ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది.

అలా తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌. ఇందులో విక్రమ్, కార్తీ, జయంరవి, జయరాం, ఐశ్వర్యారాయ్, త్రిష వంటి ప్రముఖ తారాగణం నటిస్తున్నారు. మణిరత్నం మద్రాస్‌ టాకీస్‌ సంస్థ, లైకా ప్రొడక్షన్స్‌ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం, రవివర్మ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం తొలి భాగాన్ని సెప్టెంబర్‌ 30వ తేదీన తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడం భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇందులో నటి ఐశ్వర్యారాయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు, అందులో ఒకటి ప్రతినాయిక పాత్ర అని తాజాగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రంపై అంచనాలు, ఆసక్తి మరింత పెరుగుతున్నాయి.  

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)