శతాబ్దాల నాటి పండుగ.. వేదికపై ఐశ్వర్య రాయ్‌, అనుష్కతో పాటు ఈ స్టార్స్‌ కూడా..

Published on Mon, 11/06/2023 - 11:00

కర్ణాటకలో కంబళ ఉత్సవాలు ప్రతియేటా ఘనంగా జరుగుతాయి. ఇది శతాబ్దాల నాటి ఆనవాయతీ. వారి సంస్కృతి సంప్రదాయంలో ఇదొక భాగం.. అందుకే కాంతార సినిమాలో కూడా కంబళ పోటీలలో రిషభ్‌ శెట్టి పాల్గొంటాడు. ఆ సినిమాలో కూడా వాటిని రియల్‌గానే ఆయన చిత్రీకరించారు. నవంబర్‌లో ప్రారంభమై మార్చి వరకు జరిగే వార్షిక పండుగ సీజన్‌గా గుర్తింపు ఉంది. ఈ ఏడాది పోటీల కోసం కర్ణాటక సన్నద్ధమవుతోంది. ఈసారి అతి పొడవైన ట్రాక్​ను నిర్మిస్తున్నట్టు కంబళ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అశోక్‌కుమార్​ రాయ్ వెల్లడించారు. పోటీలలో భాగంగా శీతాకాలంలో తీర ప్రాంతంలోని రైతులు.. గేదెలను పట్టుకుని బురదపై పరుగులు తీస్తారు. పంట బాగా పండాలని దేవుడుకి ప్రార్థిస్తూ ఈ పోటీలు నిర్వహిస్తారు. 

చాలా ఏళ్లుగా ఈ కంబళ పోటీలు కొనసాగుతున్నా ఈ మధ్య ఎక్కువగా దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా ఈ పోటీలు తీర ప్రాంతానికే పరిమితం. కానీ ప్రజల నుంచి భారీ రెస్పాన్స్‌ రావడంతో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని బెంగళూరు వేదికగా పాలెస్​ గ్రౌండ్స్​లో జరగనున్నాయి. నవంబర్​ 25, 26 తేదీల్లో ఈ ఈవెంట్​ జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ పోటీలను చూసేందుకు సుమారు 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ పోటీలో పాల్గొనేందుకు ఇప్పటి వరకు 150 గేదెలు ఉన్నాయి. ఆ మేరకు వాటి యజమానులు తమ పేర్లు రిజిస్టర్​ చేసుకున్నారు. పోటీలో గెలిచిన వారికి రూ. 1.50 లక్షల నగదు అందించినున్నారు. 

తీర ప్రాంతానికే పరిమితం అయిన ఈ పోటీలను ఈసారి ప్రజలకు మరింత చేరువ చేసేందుకు.. బెంగళూరులో ఈవెంట్​ను నిర్వహించాలని నిర్ణయించారు. ఫలితంగా.. నవంబర్​ 25, 26 తేదీల్లో ఈ కంబళ పోటీలు.. తొలిసారిగా పాలెస్​ గ్రౌండ్స్​లో జరగనున్నాయి. ఈసారి జరగనున్న కంబళ పోటీలకు  ప్రముఖ సినీ తారలు ఐశ్వర్య రాయ్‌, అనుష్క శెట్టి, సునీల్​ శెట్టి, శిల్పా శెట్టి, కేజీఎఫ్‌ యష్,​ దర్శన్​లతో పాటు క్రికెటర్​ కే.ఎల్​ రాహుల్​ కూడా ఈ రెండు రోజుల ఈవెంట్​లో పాల్గొంటారని అశోక్​ రాయ్ తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)