Breaking News

ఆ క్రికెటర్‌ను ప్రేమించా.. కానీ!: హీరోయిన్‌

Published on Fri, 05/12/2023 - 06:52

మాలీవుడ్‌లో హీరోయిన్‌గా, నిర్మాతగా రాణిస్తున్న నటి ఐశ్వర్య లక్ష్మి. కోలీవుడ్‌లో విశాల్‌తో యాక్షన్‌ చిత్రంలోనూ, ధనుష్‌కు జంటగా జగమే తంతిరం, ఆర్య సరసన కెప్టెన్‌ తదితర చిత్రాల్లో నటించిన ఈమె విష్ణు విశాల్‌కు జంటగా కట్టా కుస్తీ(మట్టి ​కుస్తీ) చిత్రంలో నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించి ప్రశంసలను అందుకున్నారు. అదే విధంగా ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలోనూ పూంగుళలీగా కీలక పాత్రను పోషించి పేరు తెచ్చుకున్నారు.

ఇటీవల ఈమె తన గురించి ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను పుట్టినప్పుడు తన తండ్రి శ్రీలక్ష్మీ అనే పేరు పెట్టారని, అయితే అమ్మ మాత్రం ఐశ్వర్య అని పిలిచేదన్నారు. దీంతో చివరికి తన పేరు ఐశ్వర్య లక్ష్మిగా మారిందని చెప్పారు. నటిగా తనకు డ్రీమ్‌ పాత్ర అంటూ ఏమీ లేదని, అయితే విలన్‌ రోల్స్‌లో నటించడం ఇష్టం ఉండదని, అందుకే ఎప్పటికీ అలాంటి పాత్రల్లో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

తనకు కాంచీపురం పట్టు చీరలు, కేరళ సంప్రదాయ చీరలు కట్టుకోవడం అంటే చాలా ఇష్టమని ఆమె చెప్పారు. అందుకే షూటింగ్‌ లేనప్పుడు చీరలు ధరించి ఫొటోషూట్‌ నిర్వహించుకుంటానని ఈ సందర్భంగా చెప్పారు. నటుడు అభిషేక్‌ బచ్చన్‌, విజయ్‌ నటించిన చిత్రాలను ఎక్కువగా చూస్తానన్నారు. ఇకపోతే క్రికెట్‌ క్రీడాకారుడు యువరాజ్‌ సింగ్‌ అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. తాను ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆయన్ని మనసులోనే ప్రేమిస్తూ వచ్చానని, అలాంటిది ఇప్పుడు క్రికెట్‌ క్రీడను చూడ్డానికి సమయం దొరకడం లేదన్నారు.

చదవండి: ఓటీటీ పరిశ్రమ సూపర్‌ హిట్‌

Videos

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)