Breaking News

చాలా బాధపడ్డాను.. సోషల్‌మీడియాకు గుడ్‌బై చెప్పిన ఐశ్వర్య

Published on Sat, 09/13/2025 - 12:50

మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి సోషల్మీడియాకు గుడ్బై చెప్పేసింది. ఇకనుంచి తాను ఎలాంటి పోస్ట్లు. అభిప్రాయాలను తన ఖాతాలో పోస్ట్చేయనని చెప్పింది. మలయాళంలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య.. తెలుగులోనూ 'గాడ్సే', 'అమ్ము' తదితర చిత్రాల్లో నటించింది. థగ్ లైఫ్, మామన్‌, కింగ్ఆఫ్కొత్త, మట్టి కుస్తీ, పొన్నియన్సెల్వన్‌-2 వంటి చిత్రాలతో ఆమె పాపులర్అయింది. ప్రస్తుతం సాయిధరమ్తేజ్తో సంబరాల ఏటి గట్టు చిత్రంలో ఆమె నటిస్తుంది.

సోషల్మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు ఐశ్వర్య లక్ష్మి ఇలా చెప్పుకొచ్చింది. ' ప్రస్తుతం సినిమా అనే ఆటలో నేను ఉండాలంటే సోషల్ మీడియా చాలా ముఖ్యం. ఈ మాటకు నేను ఏకీభవిస్తున్నాను. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే.., కాలానికి అనుగుణంగా మారడం అవసరమని నేను భావించాను. క్రమంలోనే ఏదో విధంగా కొన్ని అంశాల్లో సోషల్మీడియా నాకు అనుకూలంగా ఉంటుందని భావించాను. నిర్ణయమే అలవాటు పడేలా చేసింది. అయితే, అది నా పనిని పూర్తిగా డిస్ట్రబ్చేసింది. నేను చేయాలనుకున్న పనులకు దూరం చేసింది. నాలోని దాగి ఉన్న నిజమైన ఆలోచనలను సోషల్మీడియా దోచుకుంది. నా చిన్న చిన్న ఆనందాన్ని కూడా దుఃఖంగా మార్చేసింది. నా భాషను, పదాలను దెబ్బతీసింది. నా బాల్య ఆనందాలన్నింటినీ తీసివేసింది. 

ఒక మహిళగా, సోషల్ మీడియా వల్ల వచ్చిన ఇబ్బందులను ఎదుర్కునేందుకు చాలా కష్టపడ్డాను. ఇంటర్నెట్ కోరుకునే ఊహలకు తగ్గట్టుగా నేను జీవించలేకపోతున్నాను. ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్లేని వారిని ప్రజలు నెమ్మదిగా మరచిపోతారని నాకు తెలుసు.. కానీ, నేను ఆ సాహసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక నటిగా, మహిళగా, నేను సరైన నిర్ణయం ఎంచుకున్నట్లు అనుకుంటున్నాను.' అని ఆమె తెలిపింది.

నాలోని కళాకారిణిని, నాలో దాగిన అమాయకత్వం, వాస్తవికతను నిలుపుకోవడానికి నేను ఇంటర్నెట్‌కు పూర్తిగా దూరంగా ఉంటాను. నేను సరైన దారిలో వెళ్లాలనే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. దీని ద్వారా నా జీవితంలో మరింత బలమైన బంధాలు ఏర్పడుతాయనుకుంటున్నా.. ఎక్కువ సినిమాలలో నటించగలనని ఆశిస్తున్నాను. నేను మంచి సినిమాలు చేస్తూనే ఉంటా.. మునుపటిలాగా నన్ను ప్రేమతో గుర్తుపెట్టుకోండి. మర్చిపోకండి. ప్రేమతో మీ ఐశ్వర్య లక్ష్మి.' అంటూ షేర్చేసింది.

Videos

Global War: బాబా వంగా చెప్పిన ఈ 3 నిజమైతే ప్రళయమే!

Penna River: ఉధృతంగా ప్రవహిస్తున్న కుందూ నది, పెన్నా నది

Appalaraju: ప్రభుత్వ ఆస్తులను చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా ఇస్తున్నారు

చంద్రబాబు బిస్కెట్ల కోసం బరితెగించిన ఈనాడు పత్రిక

మిజోరం రాజధానికి కొత్త రైల్వే లైన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

మంత్రి నారాయణకు బిగ్ షాక్ డయేరియా బాధితుల ఫ్యామిలీ నిలదీత

YSRCP ఎప్పుడూ విజన్ తో ఆలోచిస్తుంది..విజయవాడ-గుంటూరు మధ్య పెడితే..: సజ్జల

రాజధానిపై చంద్రబాబు హాట్ కామెంట్స్

బరువెక్కుతున్న అమీర్..! కారణం అదేనా..?

RK Roja: మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది

Photos

+5

‘మిరాయ్‌’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

వింటేజ్ లుక్స్ లో ఫరియా అబ్దుల్లా నెట్టింట ఫొటోలు వైరల్

+5

రూ.2,700 కోట్ల విలాసం... కానీ తక్కువ ధరకే!! (ఫొటోలు)

+5

మాల్దీవుస్‌లో 'డిజే టిల్లు' బ్యూటీ.. నేహా శెట్టి ఫోటోలు చూశారా?

+5

హైదరాబాద్‌లో తప్పక సందర్శించాల్సిన ఆలయాలు ఇవిగో (ఫొటోలు)

+5

‘అందెల రవమిది’ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ఆరెంజ్‌ డ్రెస్‌లో అందంగా ఐశ్వర్య రాజేశ్‌ (ఫోటోలు)

+5

యాపిల్ సీఈఓతో అమితాబ్ బచ్చన్ మనవరాలు (ఫొటోలు)

+5

'మిరాయ్'తో మరో హిట్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా? (ఫొటోలు)