Breaking News

ఏఐ వీడియో.. ప్రభాస్‌-అనుష్క పెళ్లి.. చిందులేసిన బన్నీ

Published on Wed, 11/26/2025 - 17:44

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)..ఇప్పుడు  ప్రపంచాన్ని కింగ్‌లా శాసిస్తుంది. విద్య, వైద్య.. ఇలా అన్ని రంగాల్లోనూ ఇది ప్రవేశించింది. సాధారణ ప్రజలు కూడా వారి దైనందిన జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఏఐ రాజ్యమేలుతున్న  ప్రస్తుత తరుణంలో సాధ్యం కానిది ఏమున్నది అన్నట్లుగా తమ ఆలోచనలకు నెటిజన్లు రూపమిస్తున్నారు. తాము కోరుకున్నది నిజజీవితంలో కాకపోతే.. ఏఐ రూపంలో అది నెరవేర్చుకుంటున్నారు. ముఖ్యంగా తమ అభిమాన నటీనటులు విషయంలో ఈ టెక్నాలజీని బాగా వాడేస్తున్నారు. తమ ఫేవరేట్‌ హీరోలను ఎలా చూడాలనుకుంటున్నారు..అలా ఫోటోలను ఎడిట్‌ చేస్తున్నారు. 

అంతేకాదు తమకు నచ్చిన హీరోహీరోయిన్లకు ఈ టెక్నాలజీతో పెళ్లిళ్లు కూడా చేస్తున్నారు. గతంలో ఈ టెక్నాలజీ ఉపయోగించి ప్రభాస్‌కి పెళ్లి జరిగి..పిల్లలు పుడితే వాళ్లు ఎలా ఉంటారనేది చూపించారు. ఆ ఫోటోలు బాగా వైరల్‌ అయ్యాయి. తాజాగా ఏఐ టెక్నాలజీతో వెండితెరపై సూపర్‌ హిట్‌ జోడీగా పేరు తెచ్చుకున్న ప్రభాస్‌-అనుష్కలకు పెళ్లి జరిపించారు. అంతేకాదు ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోలంతా తలో ఓ పని చేశారు.

ప్రభాస్‌-అనుష్కల పెళ్లికి నాగార్జున-నాని సన్నాయి వాయించగా.. అల్లు అర్జున్‌, రవితేజ చిందులేశారు. ఇక రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ వంటలు చేయగా..గోపిచంద్‌ వడ్డించాడు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ బంతి భోజనం చేశారు. కాజల్‌, తమన్నా పెళ్లి మండపంలో డ్యాన్స్‌ చేస్తుండగా.. మహేశ్‌ బాబు, వెంకటేశ్‌ పంచ కట్టుతో పెళ్లికి హాజరయ్యారు. ప్రభాస్‌-అనుష్కల పెళ్లి ..అందరూ ఆహ్వానితులే అంటూ ఓ నెటిజన్‌ పోస్ట్‌ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్‌ అవుతోంది.  ఇది వాస్తవం అయితే ఎంత బాగుండేదో.. అని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)