Breaking News

30లోకి ఎంటరైన హీరోయిన్‌.. లగ్జరీ కారు కొన్న బ్యూటీ

Published on Wed, 10/15/2025 - 11:16

మలయాళ బ్యూటీ అహానా కృష్ణ (Ahaana Krishna) తన పుట్టినరోజు (అక్టోబర్‌ 13)కు కొత్త కారును ఇంటికి తెచ్చేసుకుంది. BMW X5 మోడల్‌ కారు కొనాలన్న కలను ఎట్టకేలకు నెరవేర్చుకుంది. తనకు తానే ఈ లగ్జరీ కారును గిఫ్ట్‌ ఇచ్చుకుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. 20's నుంచి 30'sలోకి అడుగుపెడుతున్నందుకు కొంత బాధగా ఉంది. ఏదేమైనా 30 ఏళ్ల వయసుకు హాయ్‌ చెప్పేందుకు రెడీ అయ్యాను. 

హీరో సలహాతో..
ఇప్పటివరకు నేనేం చేయాలి? ఏం చేయకూడదు? అని ఆంక్షలు విధించని అమ్మానాన్నకు థాంక్యూ. నా జీవితాన్ని నాకు నచ్చినట్లుగా బతకనిచ్చే స్వేచ్ఛ ఇ‍చ్చినందుకు ధన్యవాదాలు. నేను ఏదీ కోరుకోకపోయినా అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయి. అందుకు ఈ ప్రపంచానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని రాసుకొచ్చింది. ఎలాంటి కారు కొనాలి? ఏదైతే బాగుంటుంది? అని దుల్కర్‌ సల్మాన్‌ సలహాలు సూచనలు ఇచ్చిన తర్వాతే అహానా ఈ కారు కొనుగోలు చేయడం విశేషం. ఈ కారు ధర రూ.95 లక్షల నుంచి రూ.1 కోటి మధ్య ఉన్నట్లు తెలుస్తోంది.

సినిమా
అహానా కెరీర్‌ విషయానికి వస్తే.. గృహప్రవేశం అనే సీరియల్‌లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించింది. తండ్రితో కలిసి ఓ సీరియల్‌ కూడా చేసింది.  ఎంజన్‌ స్టీవ్‌ లోపేజ్‌ (2014) అనే మలయాళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. పదినెట్టం పడి, ఆడి, నాన్సీ రాణి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. చివరగా కొత్త లోక: చాప్టర్‌ 1 మూవీలో అతిథి పాత్రలో మెరిసింది.

 

 

 

చదవండి: వివాదాలతో సతమతం.. అప్పుడే ఫుల్‌స్టాప్‌ అంటున్న హన్సిక

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)