Breaking News

మళ్లీ అవే డిమాండ్లు! కల్కి 2898 ఏడీ సీక్వెల్‌లో దీపిక లేనట్లేనా?

Published on Fri, 06/06/2025 - 12:59

స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె (Deepika Padukone) పేరు కొన్నాళ్లుగా మార్మోగిపోతోంది. టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాతో అడ్డంగా వాదించడంతో ఆమెను ప్రభాస్‌ 'స్పిరిట్‌' నుంచి తీసేశారు. అత్యధిక రెమ్యునరేషన్‌ వంటి డిమాండ్లకు తలొగ్గినప్పటికీ వరుస డిమాండ్లు చేస్తుండటంతో సందీప్‌రెడ్డికి విసుగొచ్చింది. పైగా ఈ మధ్యే తల్లయ్యాను కాబట్టి.. రోజులో ఎనిమిది గంటలే షూటింగ్‌లో పాల్గొంటానని, సినిమా లాభాల్లో వాటా ఇవ్వాలని అనడంతో డైరెక్టర్‌కు కోపమొచ్చి ఆమెను తీసేశాడు. 

డిమాండ్లపై వెనక్కు తగ్గని దీపిక?
దీపికా స్థానంలో యానిమల్‌ బ్యూటీ త్రిప్తి డిమ్రి (Tripti Dimri)ని తీసుకున్నాడు. ఆ సమయంలో దీపిక కథ లీక్‌ చేసిందంటూనే పరోక్షంగా తనపై విమర్శలు గుప్పించాడు వంగా. ఇదిలా ఉంటే తాజాగా కల్కి 2898 ఏడీ సీక్వెల్‌లో కూడా పని గంటల గురించి, పారితోషికం గురించి డిమాండ్‌ చేసిందట! దీంతో ఆమె పాత్ర నిడివి తగ్గించాలని లేదా తనను తీసేసి ఆమె స్థానంలో త్రిప్తిని తీసుకోవాలని చిత్రయూనిట్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. మరి ఇందులో ఎంతవరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది.

బ్లాక్‌బస్టర్‌ కల్కి
స్పిరిట్‌, కల్కి 2898 ఏడీ సీక్వెల్‌.. ఇవి రెండూ ప్రభాస్‌ పాన్‌ ఇండియా సినిమాలే! ఈ రెండిట్లోనూ త్రిప్తికి నటించే ఛాన్స్‌ వచ్చిందంటే మాత్రం తన క్రేజ్‌ రెట్టింపు కావడం ఖాయం. కాగా కల్కి 2898 ఏడీ సినిమాకు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించాడు. అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు పోషించారు. సాయి మాధవ్‌ బుర్రా సంభాషణలు రాశాడు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించాడు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై అశ్వినిదత్‌ నిర్మించాడు. గతేడాది జూన్‌లో విడుదలైన ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

చదవండి: కొట్టుకోవడం కాదు.. పెద్ద హీరోలు ఆలోచించాలి: బన్నీ వాసు

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)