Breaking News

సీఎం రేవంత్‌ రెడ్డిని మరిచిపోయిన మరో తెలుగు హీరో

Published on Mon, 01/06/2025 - 08:24

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పేరు చెప్పడంలో మరో తెలుగు హీరో మరిచిపోయాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇప్పటికే పుష్ప2 సినిమా విడుదల సమయంలో అల్లు అర్జున్‌ (Allu Arjun ) మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు చెప్పే క్రమంలో కాస్త తడపడటం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు మరోసారి అదే తప్పు జరగడంతో నెటిజన్లతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి అభిమానులు భగ్గుమంటున్నారు.

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక సమావేశాలు జనవరి 5న ముగింపు కార్యక్రమం జరిగింది. ఆ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అతిథిగా పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి హోస్ట్‌గా సినీ నటుడు బాలాదిత్య (Baladitya) వ్యవహరిస్తున్నారు. సభ జరుగుతుండగా సీఎం రేవంత్‌ అక్కడకు చేరుకున్నారు. హోస్ట్‌గా ఉన్న బాలాదిత్య ఆయనకు ఆహ్వానం పలికే క్రమంలో ఇలా తప్పుగా సంబోధించారు. 'మన ప్రియతమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవనీయులు, శ్రీ కిరణ్ కుమార్ గారు' అని ఉచ్చరించారు. 

ఇంతలో అక్కడ ఉన్న వారందరూ కేకలు వేయడంతో తన తప్పును ఆయన వెంటనే గ్రహించారు. ఒక క్షణంలో తన తప్పును సరిచేసుకుని మళ్లీ మైక్‌లో ఇలా చెప్పారు. 'క్షమించాలి.. మన ప్రియతమ నాయకులు, తెలంగాణ  ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు' అని సరిచేసుకున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న కార్యక్రమంలో ఎదురుగానే ఒక సీఎం ఉంటే ఆయన పేరును తప్పుగా పిలువడం ఏంటి అంటూ సామాన్యులు కూడా విరుచుకుపడుతున్నారు. హౌస్ట్‌గా వ్యవహిరిస్తున్నప్పుడు ఇంతటి పెద్ద తప్పులు ఎలా చేస్తారని కామెంట్‌ చేస్తున్నారు. 

(ఇదీ చదవండి: త్రివిక్రమ్‌ వివాదంపై శివ బాలాజీకి కౌంటర్‌ ఇచ్చిన పూనమ్‌ కౌర్‌)

ఇదే సమయంలో బాలాదిత్య పరిస్థితిని అర్థం చేసుకుంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. గతంలో అల్లు అర్జున్‌ ఒక వేదికపై మాట్లాడుతూ సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు చెప్పే క్రమంలో కాస్త తడపడటం జరిగింది. ఆ ఘటన తర్వాత సంధ్య థియేటర్‌ కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఇప్పుడు బాలాదిత్య కూడా బహుశా.. ఆ  ఘటన తాలూకు భయంతో అతి జాగ్రత్తపడి ఉంటాడని కొందరు చెప్పుకొస్తున్నారు.  

వాస్తవంగా  ఇలాంటి కార్యక్రమాలకు హోస్ట్‌గా బాలాదిత్య చాలా చక్కగా నిర్వహించారు. గతంలో ఒక టీవీ ఛానల్‌ కోసం జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా కూడా ఆయన వ్యవహరించారు. కానీ, ఇప్పుడు ఆయన పెద్ద తప్పే చేశారని ఎక్కువ శాతం అభిప్రాయ పడుతున్నారు.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు