Breaking News

ఇది సినిమా కాదు... ఒక జీవితం: అడివి శేష్‌

Published on Sun, 05/25/2025 - 00:25

‘‘అనగనగా’ చిత్రంలో వ్యాస్‌పాత్రను సుమంత్‌గారు అంత బాగా చేయడానికి కారణం ఆయన నిజ జీవితంలోనూ అలానే ఉంటారు. సన్నీ ఈ కథను అద్భుతంగా తెరకెక్కించారు. ఓటీటీలో ఈ సినిమా చూస్తున్నంత సేపూ థియేటర్లో చూడాల్సిన సినిమా కదా అనిపించింది’’ అన్నారు అడివి శేష్‌. సుమంత్‌ కుమార్, కాజల్‌ చౌదరి జంటగా సన్నీ సంజయ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనగనగా’. రాకేశ్‌ రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈటీవీ విన్‌ ఓటీటీలో ఈ నెల 15న విడుదలైంది.

ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌ సెలబ్రేషన్స్‌కి అతిథిగా హాజరైన అడివి శేష్‌ మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలో రామ్‌పాత్ర కంటతడి పెట్టించింది. విద్యా వ్యవస్థ మారాలని కోరుకునేలా చేయించింది. ఇది సినిమా కాదు..ఒక జీవితం’’ అన్నారు. సుమంత్‌ కుమార్‌ మాట్లాడుతూ– ‘‘మేము అనుకున్న దానికంటే అద్భుతమైన ఆదరణ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా సినిమాకి వస్తున్న స్పందన చూసి ఇప్పుడు థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సినీ ప్రపంచానికి నన్ను, మా టీమ్‌ను పరిచయం చేసిన చిత్రం ఇది’’ అన్నారు సన్నీ సంజయ్‌. ‘‘ఇంత పెద్ద సక్సెస్‌ సుమంత్‌గారి వల్లే సాధ్యమైంది’’ అని రాకేశ్‌ రెడ్డి గడ్డం తెలిపారు. ఈటీవీ విన్‌ కంటెంట్‌ హెడ్‌ నితిన్‌ చక్రవర్తి మాట్లాడారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)