Breaking News

అడివి శేష్ ఎక్కడ.. కొత్త సినిమాల సంగతేంటి?

Published on Mon, 10/06/2025 - 19:16

అడివి శేష్.. ఈ పేరు వినిపించి, స్క్రీన్‌పై ఇతడిని చూసి చాలా ఏళ్లయిపోయింది. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్ హీరోలందరూ హిట్టో ఫ్లాఫో సంగతి పక్కనబెడితే ఎప్పటికప్పుడు ఏదో ఓ సినిమా చేస్తూ ప్రేక్షకుల్ని పలకరిస్తున్నారు. ఇతడు మాత్రం దాదాపు మూడేళ్ల నుంచి ఒక్క మూవీని కూడా తీసుకురావట్లేదు. ఈ ఏడాదైనా వస్తాడనుకుంటే ఈసారి కూడా పలు కారణాల వల్ల హ్యాండిచ్చేసినట్లు తెలుస్తోంది.

క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ 2.. ఇలా వరస సినిమాలతో శేష్.. సక్సెస్ అందుకున్నాడు. మరి కారణాలేంటో తెలీదు గానీ 2022 డిసెంబరులో హిట్ 2 రిలీజైంది. తర్వాత గూఢచారి, డకాయిట్ అనే చిత్రాల్ని ప్రకటించాడు. అప్పటినుంచి అవి సెట్స్‌పైనే ఉన్నాయి. లెక్క ప్రకారం 'డకాయిట్' మూవీ ఈపాటికే రిలీజైపోవాలి. తొలుత శ్రుతిహాసన్‌తో ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు. ఎక్కడ తేడా కొట్టిందో గానీ శ్రుతి ప్లేసులోకి మృణాల్ ఠాకుర్ వచ్చింది. ఈ ఏడాది క్రిస్మస్ రిలీజ్ అని పోస్టర్ కూడా అధికారికంగా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడిది వాయిదా పడ్డట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9.. ఈసారి నామినేషన్లలో ఎవరెవరంటే?)

శేష్ గతంలో ఓసారి గాయపడ్డాడు. అయితే అది ఇంకా తగ్గే దశలో ఉందని, దీంతో షూటింగ్స్ పూర్తవక 'డకాయిట్' వాయిదా పడనుందనే రూమర్స్ వస్తున్నాయి. త్వరలో కొత్త విడుదల తేదీని కూడా టీమ్ ప్రకటించనుందని తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం వచ్చే ఏడాది మే 1న విడుదల కావాల్సిన 'గూఢచారి 2' కూడా కచ్చితంగా వాయిదా పడే అవకాశముంది. మరి ఏం జరుగుతుందో చూడాలి?

శేష్ మంచి నటుడే కావొచ్చు. కానీ ఎప్పటికప్పుడు ఒకటి అరా సినిమాలు చేస్తుంటే ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు. లేదంటే మర్చిపోయే అవకాశాలు ఎక్కువ. మళ్లీ రిలీజ్ టైంలో ప్రమోషన్లలో హడావుడి చేసినా సరే ఎవరా హీరో అని అనుకోవచ్చు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ రెండు సినిమాలని థియేటర్లలోకి తీసుకొచ్చి శేష్.. హిట్ కొట్టాల్సిన అవసరముంది!

(ఇదీ చదవండి: 'కాంతార 1'లో రిషభ్ శెట్టి భార్య కూడా నటించింది.. గుర్తుపట్టారా?)

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)