Breaking News

17 ఏళ్ల వయసులో ప్రేమలో.. అడివి శేష్‌ లవ్‌స్టోరీ

Published on Fri, 11/14/2025 - 12:49

టాలీవుడ్‌లో పెళ్లీడుకొచ్చిన హీరోలు చాలామందే ఉన్నారు. కానీ, వాళ్లంతా పెళ్లి అనే పదాన్ని డిక్షనరీలో నుంచి తీసేసినట్లుగా దాని గురించే ఆలోచించడం లేదు. ప్రభాస్‌, అడివి శేష్‌, సాయిదుర్గ తేజ్‌.. ఇలా కొందరు హీరోలు సినిమాల వెంట పడుతున్నారు తప్పితే పర్సనల్‌ లైఫ్‌పై కాస్తయినా శ్రద్ధ చూపించడం లేదు.

అడివి శేష్‌ లవ్‌ స్టోరీ
ఇంట్లోవాళ్లు ఎంత ఒత్తిడి చేసినా అవేమీ పట్టనట్లు తమ పనేదో తాము చేసుకుంటూ పోతున్నారు. తాజాగా అడివి శేష్‌ (Adivi Sesh).. రాజు వెడ్స్‌ రాంబాయి సినిమా ట్రైలర్‌ లాంచ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన లవ్‌స్టోరీ వెల్లడించాడు. నేను చిన్నప్పుడు అమెరికాలోనే పెరిగాను. 17 ఏళ్ల వయసున్నప్పుడు ఒకమ్మాయిని ప్రేమించాను. 

ఆమె పెళ్లయిపోయింది
తనకోసం నా పేరెంట్స్‌కు చెప్పకుండా ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌ చేసుకుని వేరే దేశానికి వెళ్లిపోయాను. కట్‌ చేస్తే.. నా పుట్టినరోజునాడే ఆ అమ్మాయి పెళ్లయిపోయింది. తనకిప్పుడు పెద్ద పిల్లలున్నారు అంటూ నవ్వుతూ చెప్పాడు. గతంలో కూడా శేష్‌ ఈ ప్రేమకథను బయటపెట్టాడు. ఇప్పటికీ అదే చెప్తున్నాడు. ఈ గ్యాప్‌లో శేష్‌ మళ్లీ ఎవర్నీ ప్రేమించలేదా? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

సినిమా
సినిమాల విషయానికి వస్తే.. అడివిశేష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డకాయిట్‌. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా యాక్ట్‌ చేస్తున్న ఈ మూవీ ఈ క్రిస్‌మస్‌కు విడుదల కావాల్సి ఉంది. కానీ, పలు అనివార్య కారణాల వల్ల ఈ మూవీ పోస్ట్‌పోన్‌ అయింది. వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా మార్చి 19న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. హిట్‌ మూవీ గూఢచారికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న గూఢచారి 2 మే 1న విడుదల కానుంది.

చదవండి: నా కొడుకు నా ఫోటోలు చూస్తే ఇంకేమైనా ఉందా?

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)