Breaking News

అదితి శంకర్‌కు మరో ఛాన్స్‌

Published on Mon, 09/01/2025 - 13:58

స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ వారసురాలు అదితి శంకర్‌ అనే విషయం తెలిసిందే. కార్తీకి జంటగా విరుమాన్‌ చిత్రంతో కథానాయకిగా, గాయనిగా ఒకేసారి పరిచయమైన ఈ బ్యూటీ తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత శివకార్తికేయన్‌కి జంటగా మావీరన్‌ చిత్రంలో నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఆకాష్‌ మురళి హీరోగా పరిచయమైన తమిళ చిత్రం నేశిప్పాయాలో అదితిశంకర్‌ నాయకిగా నటించారు. ఆ చిత్రం నిరాశపరిచింది. అదేవిధంగా తెలుగులో ఈమె ఎంట్రీ ఇచ్చిన భైరవం చిత్రం కూడా ఆశించిన విజయాన్ని సాధించలేదు. 

దీంతో కాస్త వెనకపడ్డ అదితి ప్రస్తుతం అర్జున్‌దాస్‌కు జంటగా ఒక చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణ దశలో ఉండగానే తాజాగా మరో అవకాశం ఆమెకు తలుపు తట్టినట్లు తాజా సమాచారం. ఇంతకుముందు ఈరం, కుట్రం 23 వంటి థ్రిల్లర్‌ కథా చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు అరివళగన్‌. తాజాగా తెరకెక్కించనున్న చిత్రంలో అదితిశంకర్‌ను కథానాయకిగా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇది ఉమెన్‌ సెంట్రిక్‌ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. 

అరివళగన్‌ దర్శకుడు శంకర్‌ శిష్యుడు అన్నది గమనార్హం. దీంతో ఈయన తన గురువుగారి వారసురాలుని తెరపై ఏ విధంగా ఆవిష్కరించనున్నారో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఇప్పటినుంచే నెలకొంటోంది. ఎందుకంటే అదితిశంకర్‌ ఇప్పటివరకు ఉమెన్‌ సెంట్రిక్‌ కథా చిత్రంలో నటించలేదు.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)