శంకర్‌ కూతురు ఆ తెలుగు డైరెక్టర్‌ను అంతమాట అనేసిందేంటి!

Published on Sun, 06/01/2025 - 15:23

అభిమాన హీరో కళ్ల ముందు కనిపిస్తే చాలు సెల్ఫీలంటూ ఎగబడతారు. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ కూతుళ్లు అదితి, ఐశ్వర్య కూడా అదే పని చేశారు. తండ్రితో కలిసి షూటింగ్‌కు వెళ్లినప్పుడు ఓ హోటల్‌ దగ్గర ఆగారు. అక్కడ మహేశ్‌బాబు (Mahesh Babu)ను చూడగానే సెల్ఫీ అంటూ అతడి ముందు వాలిపోయారు. అయితే వీళ్లు శంకర్‌ కూతుర్లని తెలీక.. ఫ్యామిలీతో ఉన్నాను.. ఇప్పుడు సెల్ఫీ ఇవ్వడం కుదరదని పంపేశాడు.

అదితితో సెల్ఫీకి నో చెప్పిన మహేశ్‌
దీంతో వాళ్లు నిరాశగా వెనుదిరిగారు. ఇదంతా చూసిన డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌ (Meher Ramesh).. వెంటనే హీరో దగ్గరకు వెళ్లి.. ఆ అమ్మాయిలు ఎవరన్న విషయం చెప్పడంతో అతడు నాలుక్కరుచుకున్నాడు. శంకర్‌ దగ్గరకు వెళ్లి.. మీ కూతుర్లని తెలీక అలా చేశానని మహేశ్‌ సారీ చెప్పాడు. అందుకు శంకర్‌.. హీరోలంటే ఎలా ఉండాలో వాళ్లక్కూడా తెలియాలి కదా అని రిప్లై ఇచ్చాడు. శంకర్‌ కూతుర్లు చాలా సింపుల్‌గా ఉంటారంటూ మహేశ్‌బాబు ఈ సంఘటనను అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే షోలో వెల్లడించాడు.

మహేశ్‌కు సారీ చెప్పిన శంకర్‌ కూతుర్లు
తాజాగా ఇదే సంఘటనను అదితి శంకర్‌ (Aditi Shankar) ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో గుర్తు చేసుకుంది. నాన్న సినిమా కోసం మేమందరం ఓ చోటుకు వెళ్తున్నాం. దారిలో ఓ హోటల్‌ దగ్గర బ్రేక్‌ఫాస్ట్‌ కోసం ఆగాం. అక్కడ మహేశ్‌బాబు ఉన్నారు. నేను, నా సోదరి ఆయనకు అభిమానులం. మేము తన దగ్గరకు వెళ్లి ఓ ఫోటో అడిగాం. అందుకాయన.. ఇప్పుడు ఇవ్వలేనమ్మా అని తిరస్కరించారు. డిస్టర్బ్‌ చేసినందుకు సారీ చెప్పి వెళ్లిపోయాం. 

వీడియో వైరల్‌
అప్పుడు మహేశ్‌ బాడీగార్డ్‌ వెళ్లి.. మేము శంకర్‌ కూతుర్లమని చెప్పాడు. దాంతో ఆయన మేమున్న టేబుల్‌ దగ్గరకు వచ్చి మీ కూతుర్లని తెలీదు సర్‌ అని వివరణ ఇచ్చుకున్నాడు. పర్లేదు.. హీరో ఎలా ఉంటారో వారికి తెలియాలి. అయినా వాళ్లకు ఫోటో కావాలంటే నీ దగ్గరకు వచ్చి అడుగుతారు. ఇస్తావా? లేదా? అనేది నీ నిర్ణయం అని నాన్న అన్నాడు. ఏదో తెలీక నో చెప్పానంటూనే మహేశ్‌ మాతో ఫోటో దిగాడు అని అదితి చెప్పుకొచ్చింది. ఈ వీడియో క్లిప్పింగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు.. పాపం, మెహర్‌ రమేశ్‌ను మహేశ్‌కు బాడీగార్డ్‌ను చేసేసిందని కామెంట్లు చేస్తున్నారు.

 

 

చదవండి: కమెడియన్‌ అలీకి చిరంజీవి గిఫ్ట్‌.. ఈసారి స్పెషల్‌గా..!

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)