Breaking News

పురాతన ఆలయంలో పెళ్లి.. ముందుగా ప్లాన్ చేయలేదు: ఆదితిరావు హైదరీ

Published on Sun, 11/24/2024 - 20:27

కోలీవుడ్​ సిద్ధార్థ్ - అదితిరావు హైదరీ ఈ ఏడాదిలో వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో అదే ఆలయంలోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అయితే తాజాగా సాహిత్య ఆజ్‌తక్ -2024 సదస్సుకు హాజరైన ఆదితిరావు హైదరీ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాము కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అయితే మా పెళ్లి కోసం ప్రత్యేకంగా ఎలాంటి ప్లాన్ చేయలేదని పేర్కొంది. 400 ఏళ్లనాటి ఆలయం మా తాత, నానమ్మకు సెంటిమెంట్‌.. అక్కడే పెళ్లి చేసుకుంటే వారి ఆశీర్వాదాలు ఉంటాయని అన్నారు. మా నానమ్మ అంటే నాకు చాలా ఇష్టం.. ఆమె హైదరాబాద్‌లో పాఠశాలను ప్రారంభించిందని ఆదితిరావు తెలిపింది.

ఆదితి రావు హైదరీ మాట్లాడుతూ.. 'మా పెళ్లి పెద్దగా ప్లాన్ చేయలేదు. పెళ్లి జరిగిన ఆలయం మా పూర్వీకులు కట్టారు. దాదాపు 400 ఏళ్లుగా మా కుటుంబంలో భాగంగా ఉంది. అంతేకాదు ఆ ఆలయం నా కుటుంబంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. అలాగే నానా, నానమ్మకు చాలా ఇష్టమైన గుడి. అందుకే అక్కడ వివాహం చేసుకోవడం వారికి దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. వారి ఆశీస్సులు కూడా మాకు అందాయి' అని తెలిపింది.

కాగా.. ఆదితి రావు హైదరీ ఈ ఏడాది హీరామండి వెబ్‌ సిరీస్‌లో కనిపించింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు