Breaking News

ఆదిపురుష్‌.. టికెట్‌ రేట్లు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!

Published on Wed, 06/14/2023 - 16:32

మరో రెండు రోజుల్లో థియేటర్లలో ఆదిపురుష్‌ సందడి చేయనుంది. జూన్‌ 16వ తేదీ కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆదిపురుషుడి అవతారంలో ప్రభాస్‌ను చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటి నుంచే అటు ర్యాలీలు, ఇటు భారీ కటౌట్లు ఏర్పాట్లు చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. వీళ్ల రచ్చతో సోషల్‌ మీడియాలో ఆదిపురుష్‌ హ్యాష్‌ ట్యాగ్‌(#AdipurushBookings, #Prabhas𓃵, #AdipurushOnJune16) ట్రెండింగ్‌లో ఉంది.

మరోపక్క అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కూడా షురూ కావడంతో ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో కలిసి సినిమా చూసేందుకు సమాయత్తమయ్యారు ఫ్యాన్స్‌. టికెట్‌ రేటు ఎంతున్నా సరే తగ్గేదే లేదంటూ ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోకు టికెట్లు బుక్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అనేక చోట్ల థియేటర్లు హౌస్‌ఫుల్‌ అయిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి! అయితే కొన్ని చోట్ల టికెట్ల రేట్లు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయట.

ఢిల్లీ ఆంబియన్స్‌ మాల్‌లోని పీవీఆర్‌ డైరెక్టర్స్‌ కట్‌ థియేటర్‌లో ఆదిపురుష్‌ టికెట్‌ ధర ఎంతనుకుంటున్నారు? అక్షరాలా 2,200 రూపాయలు. ఇదేదో త్రీడీ వర్షన్‌కు అనుకునేరు. కేవలం 2డీ ఫార్మాట్‌కు మాత్రమే! ఢిల్లీలోని పీవీఆర్‌: వేగాస్‌ లగ్జ్‌ థియేటర్‌లో కూడా ఒక్క టికెట్‌ ధర రెండు వేల రూపాయలుగా ఉంది. ఇంత ధర పలుకుతున్నా సరే ఫ్యాన్స్‌ ఎగబడి టికెట్స్‌ కొనడంతో అనేక చోట్ల నిమిషాల్లోనే హౌస్‌ఫుల్‌ అవుతుండటం విశేషం.

హైదరాబాద్‌లో త్రీడీ వర్షన్‌ టికెట్‌ ధర విషయానికి వస్తే కొన్ని చోట్ల రూ.325 నుంచి మొదలవుతుండగా మరికొన్ని చోట్ల రూ.400గా ఉంది. ఆదిపురుష్‌ సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్‌ రాఘవుడిగా, కృతీ సనన్‌ జానకిగా నటించారు. సైఫ్‌ అలీ ఖాన్‌ లంకేశ్వరుడిగా సన్నీ సింగ్‌ లక్ష్మణుడిగా కనిపించనున్నారు.

చదవండి: మొన్ననే విడాకులు.. అంతలోనే మళ్లీ కలవాలనుందన్న నటుడు

Videos

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)