Breaking News

బాక్సాఫీస్‌ వద్ద ఆదిపురుష్‌ ప్రభంజనం.. కలెక్షన్స్‌ ఎంతంటే?

Published on Mon, 06/19/2023 - 14:01

ఆదిపురుష్‌ సినిమాను పొగిడేవాళ్లు పొగుడుతున్నారు, తిట్టేవాళ్లు తిడుతున్నారు. ఏదేమైనా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్నంత పాజిటివ్‌ స్పందనను మాత్రం రాబట్టలేకపోయింది. పైపెచ్చు వివాదాలు, విమర్శలు సినిమాను చుట్టుముట్టాయి. అయినప్పటికీ ఈ అడ్డంకులను అధిగమించి ఆదిపురుష్‌ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది.

మొదటి రోజు రూ.140 కోట్ల గ్రాస్‌ వసూలు చేయగా రెండో రోజు రూ.100 కోట్లు రాబట్టింది. ముచ్చటగా మూడో రోజు కూడా సెంచరీ కొట్టిందీ చిత్రం. దీంతో ఇప్పటివరకు సినిమా కలెక్షన్స్‌ రూ.340 కోట్లకు చేరాయి. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్‌. శని, ఆది వారాలు కలిసి వచ్చాయి కాబట్టి సినిమా ఈ రేంజ్‌లో వసూళ్లు రాబట్టింది. సోమవారం నుంచి సినిమాకు అసలు సిసలు పరీక్ష మొదలు కానుంది. ఈరోజు నుంచి వచ్చే కలెక్షన్సే సినిమా ఫలితాన్ని నిర్దేశించనున్నాయి. మరి వీక్‌ డేస్‌లో ఆదిపురుష్‌ ఏ మేర వసూళ్లు రాబడుతుందో చూడాలి!

ఇకపోతే ఆదిపురుష్‌ చిత్రంలో ప్రభాస్‌, కృతీ సనన్‌, సన్నీ సింగ్‌, సైఫ్‌ అలీ ఖాన్‌, దేవదత్తా నాగే.. తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఓం రౌత్‌ దర్శకత్వం వహించారు. దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం జూన్‌ 16న విడుదలైంది.

చదవండి: రాకేశ్‌ మాస్టర్‌ భౌతిక కాయాన్ని చూసి ఏడ్చేసిన శేఖర్‌, జానీ మాస్టర్‌

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)