Breaking News

Adipurush: సినిమాను బ్యాన్‌ చేయాలంటూ ప్రధాని మోదీకి లేఖ

Published on Tue, 06/20/2023 - 13:34

ప్రభాస్‌ రాముడిగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘ఆదిపురుష్‌’కు  భారీగా  విమర్శలు వస్తున్న  తరుణంలో మూవీ మేకర్స్‌కు మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటికే సోమవారం నాడు మూవీకి భారీగా కలెక్షన్స్ తగ్గాయి. ఇన నుంచి కూడా ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలియదు. ఈ తరుణంలో సినిమాను ప్రపంచవ్యాప్తంగా బ్యాన్‌ చేయాలంటూ ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ వారు ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు.

అంతే కాకుండా ఓటీటీలో కూడా సినిమా ప్రదర్శన జరగకుండా చూడాలని కోరారు. ఈ సినిమాలో శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, రావణుడి పాత్రలను మలిచిన తీరు బాగాలేదని లేఖలో పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: Adipurush: సోమవారం దారుణంగా పడిపోయిన కలెక్షన్స్‌.. కారణం ఇదే)

భారతీయ ఇతిహాసమైన రామాయణం ఇమేజ్‌ను చెడగొట్టేలా ఆదిపురుష్‌ ఉంది. ఇందులోని డైలాగ్‌లు హిందూ మనోబావాలు దెబ్బతినేలా ఉన్నాయి. సినిమా కూడా చిన్నపిల్లలు ఆడుకునే వీడియో గేమ్‌లా చిత్రీకరించారని ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ వారు లేఖలో తెలిపారు.  కాబట్టి సినిమా డైరెక్టర్‌ ఓం రౌత్‌తో పాటు రచయిత మనోజ్ ముంతాషిర్‌పై కేసు నమోదు చేసి భారతీయలు ప్రతిష్టను కాపాడాలంటూ వారు కోరారు. ఇలాంటి సినిమాలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, కృతి సనన్, సైఫ్‌ అలీఖాన్‌ భాగస్వామ్యం కావడం సిగ్గుచేటని వారు పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: లిటిల్ మెగా ప్రిన్సెస్‌ గురించి చిరు ఏమన్నారంటే?)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)