Breaking News

ఆదిపురుష్‌పై బ్యాన్‌ ఎత్తివేత! జరగనివ్వనంటున్న మేయర్‌..

Published on Thu, 06/22/2023 - 21:58

మొదట్లో బాక్సాఫీస్‌ దుమ్ము దులిపిన ఆదిపురుష్‌ ఇప్పుడు కలెక్షన్ల వేటలో నెమ్మదించింది. అయితే వివాదాలు, విమర్శలు మాత్రం ఇంతవరకు తగ్గనేలేదు. పైపెచ్చు రోజుకో వివాదం సినిమాను చుట్టుముడుతూనే ఉంది. ఇకపోతే ఆదిపురుష్‌లోని ఓ డైలాగ్‌ వల్ల నేపాల్‌ ప్రభుత్వం భారతీయ సినిమాలపై కన్నెర్రజేసింది. ఈ సినిమాలో.. సీత భారత్‌లో పుట్టిందని అర్థం వచ్చేలా ఓ డైలాగ్‌ ఉంది. దీనిపై నేపాల్‌ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

నేపాల్‌ రాజధాని అయిన ఖాట్మండులో సినిమాపై నిషేధం విధించారు. అంతేకాకుండా హిందీ సినిమాలను సైతం బ్యాన్‌ చేశారు. దీనిపై మేకర్స్‌ క్షమాపణలు కోరినప్పటికీ అక్కడి ప్రభుత్వం మాత్రం కనికరం చూపించలేదు. దీంతో నేపాల్‌ ఫిలిం యూనియన్‌ ఆదిపురుష్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ పఠాన్‌ హై కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

సెన్సార్‌ బోర్డు ఆమోదించిన ఏ సినిమా ప్రదర్శనను కూడా ఆపడానికి వీల్లేదని తెలిపింది. ఆదిపురుష్‌పై బ్యాన్‌ను ఎత్తివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోర్టు మాటలు కూడా వినేదే లేదంటున్నాడు ఖాట్మండు మేయర్‌ బాలెన్‌ షా. 'దేశ సార్వభౌమాదిధికారం, స్వతంత్రత విషయానికి వస్తే నేను ఏ చట్టానికి, న్యాయానికి కూడా కట్టుబడి ఉండను' అని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు.

చదవండి: మెగా ప్రిన్సెస్‌ రాక.. నిహారిక రియాక్షన్‌ చూశారా?
నువ్వు లేకుండా ఇల్లు బోసిపోతోంది: నటి ఎమోషనల్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)