Breaking News

తెలుగు సినిమాతో ఎంట్రీ.. డర్టీ మూవీ, బోల్డ్‌ సీన్స్‌తో విమర్శలు..

Published on Mon, 11/27/2023 - 17:15

ప్రతి ఏడాది బోలెడన్ని సినిమాలు రిలీజవుతుంటాయి. అందులో పెద్ద సినిమాల కన్నా చిన్న చిత్రాల జాబితానే పెద్దదిగా ఉంది. ఈ చిన్న సినిమాల ద్వారా ఎందరో నటీనటులు వెండితెరకు పరిచయమవుతుంటారు. అందులో కొందరే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతారు. మరికొందరు ఇక్కడ ఇమడలేక సినిమాలకు గుడ్‌బై చెప్తారు. ఇప్పుడు చెప్పుకునే హీరోయిన్‌ ప్రయాణం.. టాలీవుడ్‌తోనే మొదలైంది. అయితే తనకు కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా ఇచ్చింది మాత్రం బాలీవుడే.. ఇంతకీ ఆ హీరోయిన్‌ మరెవరో కాదు సిమ్రత్‌ కౌర్‌.

1997లో ముంబైలో పుట్టింది సిమ్రత్‌ కౌర్‌. 2017లో ప్రేమతో మీ కార్తీక్‌ చిత్రంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా ప్రయాణం మొదలుపెట్టింది. తర్వాతి ఏడాది పరిచయం అనే సినిమా చేసింది. అదే ఏడాది హిందీలో సోని అనే మూవీ చేసింది. రెండేళ్లపాటు ఖాళీగా ఉన్న ఆమె 2020వ సంవత్సరంలో డర్టీ హరితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇందులో బోల్డ్‌ సన్నివేశాల్లో నటించినందుకు గానూ చాలామంది ఆమెను తిట్టిపోశారు. కానీ గదర్‌ 2 సినిమాతో తన సత్తా ఏంటో నిరూపించింది. ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.691 కోట్లు రాబట్టింది. బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో సిమ్రత్‌ కెరీర్‌లోనే ఈ మూవీ ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోయింది.

చదవండి: టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ నన్ను తన గదికి రమ్మన్నాడు.. షకీల సంచలన ఆరోపణలు

Videos

చంద్రబాబు గుర్తుపెట్టుకో.. చీర లాగి.. ఇంత దారుణంగా కొడతారా..? జనసేన నేత వార్నింగ్

ప్రసాద్ బాబుకు ఒక న్యాయం.. ఇందిరకు మరో న్యాయమా?

విడుదల రజిని ఘటనపై ధ్రువ్ రాఠీ స్పందన

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

Photos

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు