Breaking News

కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ, అగ్గిపుల్ల కాదేదీ త్రిషకు అనర్హం

Published on Tue, 11/18/2025 - 06:58

సెలబ్రిటీలు ఏం చేసినా అది వార్తే అవుతుంది. అలా ఒక్కో సెలబ్రిటీకి ఒక్కో హాబీ ఉంటుంది. వీటిలో ఎక్కువగా పెట్‌ లవర్స్‌  ఉంటారు. అలా నటి త్రిష కృష్ణన్ కూడా సునక ప్రేమికురాలు అన్న విషయం తెలిసిందే. ఈమె ఇంటిలో పెట్‌ డాగ్స్‌ ఎక్కువగానే ఉంటాయి. అంతే కాకుండా తను ట్రావెలింగ్‌ చేస్తున్న దారిలో ఏదైనా కుక్క బాధింపులకు గురైతే దాన్ని ఇంటికి తీసుకొచ్చి వైద్యం చేయించి సంరక్షణ బాధ్యతలు చేపడతారు. ఇలా పెట్‌ అభిమాని అయిన  త్రిష పెటా సమాఖ్యకు బ్రాండ్‌ అంబాసీడర్‌గానూ వ్యవహరించారు. ఇక తన పెట్‌ డాగ్‌ మరణిస్తే మనిషి మరణించినంతగా బాధ పడతారు. 

తాజాగా తన పెట్‌ కుక్క పిల్ల (ఐజీ కృష్ణన్) పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. తన పెంపుడు కుక్క మొదటి ఏడాది పుట్టిన రోజును నిర్వహించిన త్రిష, తన ఇంటిపెరట్లో కాగితపు తోరణాలు, బెలూన్లతో సుందరంగా డెకరేషన్‌ చేసి, తన కుక్కపిల్లకు ఇష్టమైన రకరకాల ఆహారాన్ని కేక్‌ చుట్టు ఏర్పాటు చేశారు. ఆ కుక్క పిల్ల తనకు చాలా ప్రత్యేకం. డాగ్‌ ఫుడ్‌కు సంబంధించి ప్రముఖ కంపెనీకి బ్రాండ్‌అంబాసిడర్‌గా ఆ కుక్క పిల్ల ఉన్నడం విశేషం. త్రిషకు ఎంతో ప్రత్యేకమైన తన డాగ్‌కు నూతన వ్రస్తాలు ధరింపజేసి ఒళ్లో కూర్చోపెట్టుకుని ముద్దాడి, దానికి బదులు తనే కేక్‌ కట్‌ చేసి ,తినిపించి పుట్టిన రోజు వేడుకను నిర్వహించారు. ఆ ఫొటోలను తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. తన కుక్క పేరుతో  ఒక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను కూడా ఆమె ప్రారంభించడం విశేషం.

ఇదంతా చూస్తుంటే మహాకవి శ్రీశ్రీ రాసిన కుక్కపిల్ల.. సబ్బుబిళ్ళ... అగ్గిపుల్ల కాదేదీ కవితకు అనర్హం అన్న  అంశం గుర్తుకొస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల నటి త్రిషకు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అందుకు  కారణం ఆమె నటించిన విడాముయర్చి, థగ్స్‌ లైఫ్‌ వంటి చిత్రాలు పూర్తిగా నిరాశపడటమే కావచ్చు. కాగా ప్రస్తుతం తమిళంలో ఈమె సూర్యకు జంటగా నటిస్తున్న కరుప్పు చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అదే విధంగా తెలుగులో చిరంజీవికి జంటగా నటించిన విశ్వంభర ఆపై మలయాళంలో రామ్‌ అనే చిత్రం మాత్రమే ఈమె చేతిలో ఉన్నాయి. అయితే కొత్త అవకాశాలేవీ లేవన్నది గమనార్హం.   

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?