ఖలేజా రీ రిలీజ్‌.. అనూహ్యంగా ట‍్రెండింగ్‌లోకి వచ్చిన నటి.. అసలు విషయం ఇదే!

Published on Sun, 06/01/2025 - 14:51

మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూవీ ఖలేజా. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీ రిలీజ్‌ చేశారు. అప్పట్లో థియేటర్లలో అంతగా రాణించని ఈ చిత్రం.. రీ రిలీజ్‌లో మాత్రం ఊహించని రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. మొదటి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రీ రిలీజ్‌ రోజు మహేశ్ బాబు అభిమానులు థియేటర్లలో ఓ రేంజ్‌లో సందడి చేశారు. ఓ ‍అభిమాని ఏకంగా పామును పట్టుకుని మూవీ థియేటర్‌కు వచ్చాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది.

అయితే ఈ సినిమా రీ రిలీజ్ తర్వాత అనూహ్యంగా ఆమె పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఆమె ఈ సినిమాలో నటించిన హీరోయిన్‌ అనుష్క అని అందరూ అనుకుంటున్నారేమో. అస్సలు కాదు.. ఓ చిన్న పాత్రలో మెప్పించిన ఆమె ఉన్నట్టుండి సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఈ స్టోరీ చదివేయండి.

ఈ సినిమాను ఎక్కువగా రాజస్థాన్‌లో షూట్ చేశారు. ఆ సమయంలో టాక్సీ డ్రైవర్‌ అయినా హీరో దిలావర్ సింగ్‌ అనే వ్యక్తి కుటుంబాన్ని కలిసేందుకు వెళ్తాడు. ఈ సీన్స్ మహేశ్‌ బాబు ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. ఈ సీన్స్‌లో నటించిన దిలావర్ సింగ్‌ భార్యగా నటించిన ఆమె దివ్య మేరి సిరియాక్ అని నెట్టింట తెగ వైరలైంది.  అయితే ఇది చూసిన ఆమె..  ఖలేజా మూవీలో తాను నటించలేదని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆమె క్లారిటీ ఇచ్చింది.

తాజాగా ఖలేజా రీ రిలీజ్ కావడంతో దిలావర్‌ సింగ్‌ భార్యగా నటించింది దివ్య మేరి సిరియాక్ అని నెట్టింట వైరలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. ఆ రోల్ తాను చేయలేదని స్పష్టం చేసింది. తానేనని చాలామంది పొరపాటుగా పోస్ట్ చేశారని తెలిపింది. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)