Breaking News

ఆ హీరోను చంపినట్లే నన్నూ చంపేస్తారు: హీరోయిన్‌

Published on Sat, 07/26/2025 - 09:08

ఇంట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ కొద్దిరోజుల క్రితం బోరున ఏడ్చేస్తూ హీరోయిన్‌ 'తనుశ్రీ దత్తా' (Tanushree Dutta) ఒక వీడియో విడుదల చేసింది. తన ఇంట్లోనే తనకు భద్రత లేదంటూ చెప్పింది. అయితే, తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన కామెంట్స్చేసింది. ఇంట్లో వేధింపులపై తాను చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్కావడంతో ఫోన్కాల్స్ఎక్కువ అయ్యాయని పేర్కొంది. తన జీవితం ఆధ్యాత్మిక మార్గం వైపు ప్రయాణించడంతో తాను ఎక్కువగా ఎవరినీ కలవడంలేదని చెప్పింది.

'కొంత కాలంగా నేను ఆరోగ్యంపరంగా ఇబ్బందులు పడుతున్నాను. నాకు జరిగిన అన్యాయాన్ని అందరికీ చెబుతాను. అయితే, నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనీయండి. ఇండియాలో బాలీవుడ్మాఫియా గ్యాంగ్చాలా పెద్దది, ప్రమాదమైంది కూడా.. నేను నోరు విప్పితే ముంబైలో నా ప్రాణానికి ప్రమాదం ఉంది. నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మాదిరే నా ప్రాణం కూడా ప్రమాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం కొందరు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు.' అని ఆమె చెప్పింది.

ఇంట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ హీరోయిన్‌ తనుశ్రీదత్తా మొదట ఒక వీడియో విడుల చేసింది. నాలుగైదేళ్లుగా ఈ బాధను భరిస్తున్నా.. 2018లో మీటూ ఉద్యమం అప్పటినుంచి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. నా ఇంట్లోనే నాకు భద్రత లేకుండా పోయింది అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంది. మీటూ ఉద్యమం తర్వాతే ఈ వేధింపులు ఎక్కువయ్యాయని బయటపెట్టింది. నానాపటేకర్‌ ఇదంతా చేయిస్తున్నాడని ఆరోపిస్తోంది. ఎన్జీవోలో జరుగుతున్న కార్యకలాపాలను బయటపెడతానన్న భయంతో చుల్మాన్‌ భాయ్‌ (సల్మాన్‌ ఖాన్‌)కు రూ.5 కోట్లిచ్చి తనకు బ్రేకులు వేయమని చెప్పాడంది. దాంతో చుల్మాన్‌ ఇలా కొందరు మనుషులను పెట్టించి.. రాత్రిపూట తన ఇంటి ఎదుట ఏవేవో శబ్ధాలు చేయిస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. సినిమాల విషయానికొస్తే 2005లో వీరభద్ర సినిమాలో బాలక్రిష్ణతో తనుశ్రీదత్తా నటించింది. అయితే, 2013లో ఆమె చివరి సినిమా బాలీవుడ్లో నటించి తర్వాత బ్రేక్ఇచ్చింది.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు