Breaking News

గొప్ప మనసు చాటుకున్న తాప్సీ.. భర్తతో కలిసి సాయం!

Published on Sun, 04/13/2025 - 21:19

టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన ప్రియుడు, డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియాస్‌ బోతో ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. చాలా ఏళ్లపాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు  కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే అంతకుముందే తాము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని చెప్పి అభిమానులకు షాకిచ్చింది ముద్దుగుమ్మ.

ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటిస్తోన్న ముద్దుగుమ్మ.. గతేడాది చివరిసారిగా ఫిర్ ఆయి హసీన్ దిల్‌రుబా అనే మూవీలో కనిపించింది. ఈ చిత్రాన్ని గతంలో విడుదలైన హసీన్ దిల్‌రుబాకు సీక్వెల్‌గా తెరకెక్కించారు. అంతకుముందు షారూఖ్ ఖాన్ నటించిన డుంకీ చిత్రంలోనూ కనిపించింది. ప్రస్తుతం గాంధారీ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. దేవాశిష్‌ మఖీజా దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కనికా థిల్లాన్‌ కథ అందించడంతోపాటు నిర్మిస్తున్నారు.

అయితే తాజాగా హీరోయిన్ తాప్సీ తన మంచి మనసును చాటుకుంది. సినిమాలే కాదు సమాజ సేవలోనూ ముందుంటానని చెబుతోంది. వేసవికాలం కావడంతో ఎంతోమంది పేదలకు అండగా నిలిచింది. ఓ ప్రముఖ స్వచ్ఛంద సంస్థతో కలిసి రేకుల షెడ్డుల్లో నివాసముంటున్న పేదలకు టేబుల్ ఫ్యాన్స్, కూలర్లను అందజేసింది. తన భర్త మథియోస్ బోతో కలిసి వారి ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా అందించింది. దీంతో తాప్సీ చేసిన పనికి నెటిజన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది చూసిన అభిమానులు తాప్సీ గ్రేట్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే తన బయోలో లింక్ కూడా ఉందని ఇన్‌స్టాలో షేర్ చేసింది హీరోయిన్ తాప్సీ.

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)