Breaking News

రెండో పెళ్లి చేసుకోవడంపై సురేఖావాణి క్లారిటీ

Published on Fri, 07/31/2026 - 15:45

తెలుగు సినిమాల్లో సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో సురేఖావాణి కూడా ఒకరు. ప్రస్తుతం ఈమె మన దగ్గర పెద్దగా చిత్రాలేం చేయట్లేదు గానీ తమిళంలో కాస్త బిజీగానే ఉంటోంది. అలా ఈమె నటించిన 'నిరమ్' తెలుగులోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రెండో పెళ్లి గురించి సురేఖావాణికి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె సమాధానం కూడా ఇచ్చేసింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన ఫీల్ గుడ్ సినిమా.. 'చిన్న చిన్న ఆశై' తెలుగు రివ్యూ)

గతంలో మీ అమ్మాయి, మీకు ఇష్టమైతే మళ్లీ పెళ్లి చేస్తానని చెప్పింది. దీనిపై మీరేం అంటారు అని ఓ రిపోర్టర్ సురేఖావాణిని ప్రశ్నించగా.. 'ఆ ఆలోచన అయితే లేదు. ఉండుంటే ఇన్నిరోజులు వెయిట్ చేయాల్సిన అవసరముండేది కాదు. ప్రస్తుతానికి ఆలోచన లేదు. ఇక మీదట కూడా ఉండదనే అనుకుంటున్నాను. మా అమ్మాయికి పెళ్లి చేసే వయసొచ్చింది. నేనేం పెళ్లి చేసుకుంటాను? నా పెళ్లి, ప్రెస్ వాళ్లు ఎప్పుడో చేసేశారు. రాసేశారు కూడా' అని నవ్వుతూ సమాధానమిచ్చింది.

చాలా ఏళ్లుగా సురేఖావాణి నటిగా కొనసాగుతుండగా.. ఈమె కూతురు సుప్రీత కూడా ఇండస్ట్రీలోకి వచ్చింది. హీరోయిన్‌గా పలు చిన్న చిత్రాలు చేస్తోంది. అయితే సురేఖావాణి పెళ్లిపై గతంలోనూ పలుమార్లు ఇలానే రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు పూర్తి క్లారిటీ ఇచ్చేయడంతో ఇకనైనా పుకార్లు ఆగుతాయేమో చూడాలి? ఇక సోషల్ మీడియాలో పెట్టే గ్లామరస్ ఫొటోలు, వీడియోల గురించి స్పందించిన ఈమె.. నాకు ఏ పోస్ట్ పెట్టాలనిపిస్తే అది పెడతా ఎలా ఫొటో దిగాలనిపిస్తే అలా దిగుతా. చుట్టుపక్కల ఏమనుకుంటారో నాకు అనవసరం. మనది ఏంటి... నేను ఏంటి... నాకేంటి... అంతే! అని చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: మహేశ్ అన్న కొడుకు సినిమా.. తొలిరోజు కలెక్షన్స్ ఎంత?)

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)