Breaking News

పచ్చబొట్టు వేయించుకున్న సురేఖావాణి.. బిల్డప్‌ దేనికంటూ ట్రోలింగ్‌

Published on Thu, 06/12/2025 - 17:44

టాలీవుడ్‌ సీనియర్‌ నటి సురేఖావాణి (Surekha Vani) పచ్చబొట్టు వేయించుకుంది. ఏముందిలే, కూతురు సుప్రిత పేరును టాటూ వేయించుకుని ఉంటుందనుకుంటున్నారేమో! కానే కాదు, తనకెంతో ఇష్టమైన ఏడుకొండలస్వామి పాదుకలను కుడి చేతిపై పచ్చబొట్టుగా పొడిపించుకుంది. అలాగే గోవింద నామాలు కూడా ఉన్నాయి.

టాటూ వీడియో..
ఇందుకు సంబంధించిన వీడియోను సురేఖ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అందులో పచ్చబొట్టు వేస్తుండగా సురేఖ నొప్పితో విలవిల్లాడుతుంటే కూతురు సుప్రీత తనకు ధైర్యం చెప్తూ చప్పట్లు కొడుతోంది. అయితే నొప్పిని పంటికింద భరించిన సురేఖ.. చివర్లో ఆ టాటూ చూసి తను పడ్డ కష్టమంతా మర్చిపోయింది. ముందు నా పెదబాబు నడుస్తాడు. ఆయన వెనకాల నేనూ నడుస్తాను. గోవిందా గోవిందా.. అని సురేఖ క్యాప్షన్‌ రాసుకొచ్చింది. 

ఆయన వెనకాలే నేను
ఇది చూసిన నెటిజన్లు కొందరు ఆమె భక్తికి మెచ్చుకుంటున్నారు. మరికొందరేమో ఓవరాక్టింగ్‌ చేస్తోంది, టాటూ ఉంది కానీ అక్కడ భక్తి లేదు అని విమర్శిస్తున్నారు. అయితే సురేఖకు తిరుమల స్వామివారు అంటే ఎంతో నమ్మకం. ఆ మధ్య తిరుపతిలో ఆమె తలనీలాలు కూడా సమర్పించింది. తనకు ఏ కష్టమొచ్చినా, సంతోషమొచ్చినా కచ్చితంగా తిరుమల వెళ్తుంది.

సినిమా
సురేఖావాణి మొదట్లో తెలుగు వెండితెరపై నటిగా రాణించింది. దుబాయ్‌ శీను, నాయక్‌, బొమ్మరిల్లు, రెడీ, పిల్లా నువ్వు లేని జీవితం.. ఇలా ఎన్నో సినిమాల్లో తన కామెడీతో నవ్వించింది. ముఖ్యంగా బ్రహ్మానందం కాంబోలో సురేఖావాణి చేసిన సినిమాలన్నీ హిట్టయ్యాయి. ఈ మధ్య అవకాశాలు తగ్గడంతో సినిమాల సంఖ్య కూడా తగ్గుతూ పోతోంది. అయితే కూతురు సుప్రీతను హీరోయిన్‌ చేసింది సురేఖ. చౌదరిగారి అబ్బాయి నాయుడు గారి అమ్మాయి సినిమాతో సుప్రిత హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది.

 

 

చదవండి: Akhil-Zainab Reception: తమ్ముడి రిసెప్షన్‌.. అన్నావదినలదే హవా

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)