Breaking News

నాకు ఏం కావాలి? ఏం వద్దో బాగా తెలుసు: శోభిత

Published on Mon, 02/16/2026 - 16:18

కొంతమంది సెలబ్రిటీలు ఎప్పుడూ వార్తల్లో ఉండాలనుకుంటారు. ఏదో ఒకరకంగా తమ గురించే మాట్లాడుకోవాలని, అందరి నోళ్లలో నానుతూ ఉండాలని తహతహలాడతారు.అలా పబ్లిసిటీ కోసం పీఆర్‌ టీమ్‌లను పెట్టుకుంటారు. కానీ తనకు అలాంటివేవీ ఇష్టం లేదని, పీఆర్‌ టీమ్‌ అసలే లేదని చెప్తోంది హీరోయిన్‌ శోభిత ధూళిపాళ.

24 గంటలు కనిపించాలా?
తాజాగా ఓ ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ.. గతంలో నేను పీఆర్‌ ఏజెన్సీలతో పని చేశాను. కానీ, నా వ్యక్తిత్వానికి ఆ పద్ధతులు సెట్‌ అవవు అని అర్థమైంది. 24 గంటలు అందరికీ కనిపించాలి, అందరూ నాకోసం మాట్లాడుకోవాలి అని నేను అనుకోవడం లేదు. అది నాకు ఏమాత్రం ఉపయోగపడదు, దానిపై నాకు ఆసక్తి అసలే లేదు.

అదైతే తెలుసు
నాకు పీఆర్‌ లేదు, కానీ కొందరికి అది బానే పని చేస్తుంది. నేను సినీ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి రాలేదు, నాది ముంబై కూడా కాదు. వైజాగ్‌ నుంచి వచ్చి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నేను ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ ముందుకు సాగాను. నాకు ఏం కావాలి? ఏం వద్దనే విషయాలపై క్లారిటీ ఉంది. రూల్స్‌తో సంబంధం లేకుండా నా దారిలో వెళ్లడమే నాకిష్టం. జనాలకు ఏదిష్టం, వాళ్లేం కోరుకుంటున్నారు? అనేది నాకు తెలియదు. కానీ నా గురించి నాకు బాగా తెలుసు అని చెప్పుకొచ్చింది.

సినిమా
శోభిత ధూళిపాళ తెలుగమ్మాయే అయినప్పటికీ బాలీవుడ్‌లో ఎక్కువ పాపులర్‌ అయింది. గూఢచారి, మేజర్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరైంది. ఇటీవలే చీకటిలో సినిమాతో మరోసారి అలరించింది.

చదవండి: అప్పుడు రూ.500 అప్పు.. రూ.90 కోట్ల కలెక్షన్స్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)