Breaking News

స్టార్‌ హీరోయిన్‌ కుమారుడి గ్రాడ్యుయేషన్ పూర్తి.. ఫోటో వైరల్‌

Published on Fri, 06/06/2025 - 15:23

ఒక నాటి మేటి నటి సిమ్రాన్ సౌత్‌ ఇండియాలోని అన్ని భాషలలో నటించి చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు. 2003లో తన వివాహం తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చేశారు. కానీ, ఏదైన కథ నచ్చితే అడపాదడపా పలు సినిమాల్లో నటించారు.  అయితే, ఇప్పుడు తన కుమారుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడని సంతోషంతో సోషల్‌మీడియాలో ఆమె పంచుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ముంబైకి చెందిన సిమ్రాన్‌ పెళ్లి తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు. 2003లో తన చిన్ననాటి స్నేహితుడు దీపక్ బగ్గాను ప్రేమించి ఆమె పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ సంస్థలో దీపక్‌ ఉద్యోగం చేసేవాడు. సిమ్రాన్‌తో పెళ్లి తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక సినిమా ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేశాడు. అందులో సీరియల్స్‌తో పాటు పలు చిన్న బడ్జెట్‌ సినిమాలు నిర్మించారు. ఆపై దీపక్‌ కూడా సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నించాడు. కానీ, అది పెద్దగా వర్కౌట్‌ కాలేదు. ఈ దంపతులకు అధీప్, ఆదిత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.  

అయితే, ఇప్పుడు అధీప్‌ గ్రాడ్యేషన్‌ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా తన కుమారుడి గురించి సిమ్రాన్‌ ఇలా చెప్పుకొచ్చారు. ' చిన్ని చిన్ని చేతులతో మా ముందు నిల్చోని ఉన్న రోజులు గుర్తు ఉన్నాయి. ఇప్పుడు నిన్ను గ్రాడ్యుయేషన్ గౌనులో మా కంటే ఎత్తుగా నిలబడటం వరకు నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నువ్వు ఏదిగే తీరును చూసి  మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. నీకు అభినందనలు ఓడో, నువ్వు మమ్మల్ని ఎల్లప్పుడు చాలా గర్వపడేలా చేస్తావు.' అని సిమ్రాన్‌ పేర్కొన్నారు.

సీనియర్ స్టార్ హీరోయిన్  సిమ్రాన్.. 1976లో ముంబైలో రిషిబాలా నావల్‌లో జన్మించిన ఆమె 1995లో హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సిమ్రాన్.. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 1996లో అబ్బాయిగారి పెళ్లి చిత్రం ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.  1997లో విడుదలైన నేరుక్కు నెర్ సినిమా తమిళంలో ఫుల్ క్రేజ్ తీసుకువచ్చింది. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. సౌత్‌లో చిరంజీవి,రజనీకాంత్‌,కమల్‌ హాసస్‌, బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల అందరి సరసన హీరోయిన్‌గా మెప్పించింది.
 

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు