Breaking News

అలాంటి పాత్రల కంటే ఇది చాలా బెటర్‌.. సిమ్రాన్‌ కౌంటర్‌ 'లైలా' గురించేనా..?

Published on Sun, 04/20/2025 - 13:18

గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో అతిధి పాత్రతో సీనియర్‌ హీరోయిన్‌ సిమ్రాన్‌ మెప్పించారు. ఆమె నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో, తాజాగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో సిమ్రాన్ చెప్పిన ఒక విషయం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇందులో సిమ్రాన్ మరో నటి గురించి ఇలా మాట్లాడారు. 'కొద్దిరోజుల క్రితం నాతో పాటు పనిచేసిన ఒక నటికి నేను మెసేజ్‌ పంపాను. ఆమె నటించిన సినిమా గురించి చెబుతూ ఆ పాత్రలో మిమ్మల్ని చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయానన్నాను. ఆపై మీ పాత్ర చాలా బాగుందని కూడా చెప్పాను. 

దానికి ఆమె నుంచి వెంటనే నాకు తిరిగి సమాధానం వచ్చింది.  ఆంటీ రోల్స్‌లో నటించడం కంటే ఇదే బెటర్‌ కదా అంటూ ఆమె నుంచి షాకింగ్‌ రిప్లై  వచ్చింది. నేను మంచి ఉద్దేశంతోనే మెసేజ్‌ చేశాను. కానీ, ఆమె నుంచి నేను అలాంటి సమాధానం ఎప్పుడూ ఊహించలేదు. నేను పంచుకున్నది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం. ఆమె ఎంతో చులకనగా మాట్లాడినట్లు నాకు అనిపించింది. అందుకే ఆమెకు ఇప్పుడు వేదిక మీదుగా సమాధానం చెబుతున్నాను. పనికిమాలిన డబ్బా రోల్స్‌లో నటించడం కంటే ఆంటీ , అమ్మ పాత్రలలో నటించడం చాలా ఉత్తమం. దేనిని చులకనగా చూడకూడదు' అని సిమ్రాన్‌ చెప్పుకొచ్చారు. కానీ, ఆమె పెరు వెళ్లడించలేదు.

ముగ్గురు బిడ్డలకు తల్లిగా నటించా: సిమ్రాన్‌
2002లోనే తాను 'కన్నతిల్ ముత్తమిట్టల్' (అమృత) సినిమాలో ముగ్గురు బిడ్డలకు తల్లిగా నటించానని సిమ్రాన్‌ గుర్తుచేశారు. అప్పుడు తన వయసు కేవలం 25 ఏళ్లు మాత్రమే అని ఆమె చెప్పారు. R. మాధవన్‌కు భార్యగా సిమ్రాన్ ఈ మూవీలో అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వచ్చిన విషయం తెలిసిందే.

లైలా గురించేనా..?
ఈ ఏడాదిలో విడుదలైన శబ్ధం సినిమాలో సిమ్రన్‌, లైలా ఇద్దరూ కలిసి నటించారు. ఇందులో ఆది పినిశెట్టి హీరో. హార‌ర్ ఎలిమెంట్‌గా వచ్చిన సినిమాలో డాక్ట‌ర్ డ‌యానా పాత్రలో సిమ్రన్‌ నటించగా.. నాన్సీ డేనియ‌ల్‌గా కీలకమైన పాత్రలో లైలా నటించింది. ఈ సినిమా సమయంలోనే వారిద్దరి మధ్య చర్చ జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. సిమ్రాన్‌ చేసిన కామెంట్లు లైలా గురించే అని కొందరు చెబుతున్నారు.

సిమ్రాన్‌కు సౌత్‌ ఇండియాలో భారీగానే అభిమానులు ఉన్నారు. 1990, 2000 దశకంలో ఆమె తిరుగులేని హీరోయిన్‌గా తమిళ, తెలుగు పరిశ్రమలో దుమ్మురేపింది. హీరోల కంటే సిమ్రానే ఫుల్‌ బిజీగా ఉండేది. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరూ హీరోల సరసన నటించిన సిమ్రాన్‌..  కోలీవుడ్‌లో విజయ్, అజిత్, సూర్య, రజనీకాంత్, కమల్ వంటి స్టార్స్‌తో మెప్పించారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)