Breaking News

డిటెక్టీవ్‌గా అక్కడ ఎంట్రీ ఇస్తున్న శృతిహాసన్‌

Published on Thu, 04/04/2024 - 06:43

సౌత్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ శృతిహాసన్‌ సినీ కేరీర్‌ను చూస్తే నటిగా, సంగీత దర్శకురాలిగా, గాయనీగా, గీత రచయితగా తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 14 ఏళ్ల వయసులోనే తన తండ్రి కమలహాసన్‌ కథానాయకుడిగా నటించిన హేరామ్‌ చిత్రంలో బాల నటిగా రంగప్రవేశం చేసిన శృతిహాసన్‌ ఆ తరువాత లక్‌ అనే హిందీ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు.

ఆ తరువాత తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తమిళంలో ఏళాం అరివు (7th సెన్స్) చిత్రంలో సూర్యకు జంటగా నటించి గుర్తింపు పొందారు. అలా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయకిగా రాణిస్తున్న శృతిహాసన్‌ ఇప్పుడు హాలీవుడ్‌ చిత్రంలో నటించే స్థాయికి ఎదిగారు. చైన్నె స్టోరీ అనే అంతర్జాతీయ చిత్రంలో నటిస్తున్నారు. నిజానికి ఈ చిత్రంలో నటించే లక్కీఛాన్స్‌ను నటి సమంత పొందారు.

అయితే ఆమె మైయోసిటీస్‌ అనే అరుదైన వ్యాధికి గురి కావడంతో ఆ అవకాశాన్ని వదులుకున్నారు. దీంతో ఆ అదృష్టం శృతిహాసన్‌ను వరించింది. ఇది అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌ అనే హాస్య నవల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో శృతిహాసన్‌ అనూ అనే లేడీ డిటెక్టీవ్‌గా నటిస్తున్నారు. కాగా ఈమె ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. హాలీవుడ్‌ చిత్రంలో నటించడం తన మనసుకు ఉత్సాహాన్నిస్తోందని ఆమె ఒక భేటీలో పేర్కొన్నారు.

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)